Watch Video: గాల్లో తేలుతూ.. కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే.. వైరల్ వీడియో..

|

Apr 18, 2023 | 9:30 PM

SRH VS MI, IPL 2023: ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ అద్భుతమైన క్యాచ్ పట్టి ఆశ్చర్యపరిచాడు. ఈ టెక్నిక్ చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు.

Watch Video: గాల్లో తేలుతూ.. కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే.. వైరల్ వీడియో..
Aiden Markram Catch Video
Follow us on

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రామ్‌ బ్యాటింగ్‌కే కాదు, ఫీల్డింగ్‌లోనూ రాణిస్తుంటాడు. ముంబై ఇండియన్స్‌పై తన అత్యుత్తమ ఫీల్డింగ్‌ను శాంపిల్‌గా చూపించాడు. మార్క్రామ్ సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టిన తీరు చూస్తే.. ఫిదా అవ్వాల్సిందే. సూర్యకుమార్ యాదవ్ 7 పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు. మార్కో జాన్సన్ బౌలింగ్‌లో మార్క్రామ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో మిస్టర్ 360 ప్లేయర్ రెండెంకల స్కోర్ చేయకుండానే పెవిలియన్ చేరాడు.

ముంబయి ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో మార్క్రామ్ ఈ తుఫాను క్యాచ్‌ అందుకున్నాడు. మార్కో జాన్సన్ వేసిన ఐదో బంతికి సూర్యకుమార్ యాదవ్ ఏరియల్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే మిడ్-ఆఫ్ వద్ద నిలబడిన ఐడెన్ మార్క్రామ్ తన ఎడమవైపు డైవ్ చేస్తూ బంతిని క్యాచ్ చేశాడు. అతను ఈ క్యాచ్‌ను క్లాస్‌గా, ఎటువంటి ఆవేశానికి లోనుకాకుండా ఒడిసి పట్టాడు. ఈ టెక్నిక్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఇవి కూడా చదవండి

మార్క్రామ్ హ్యాట్రిక్ క్యాచ్‌లు..

మార్క్రామ్ కేవలం సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ ఒక్కటే కాదు. అంతకుముందు ఈ ఆటగాడు రోహిత్ శర్మను కూడా పెవిలియన్ చేర్చాడు. అలాగే ఇషాన్ కిషన్ క్యాచ్‌ను కూడా మార్క్రామ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ కూడా అంత సులువు కాదు. కానీ మార్క్రామ్‌ క్యాచ్ పట్టడంలో ఎటువంటి తప్పు చేయలేదు. మార్క్రామ్ ఈ విధంగా మూడు క్యాచ్‌లను పట్టి హ్యాట్రిక్ సాధించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..