సునీల్ నరైన్(Sunil Narine) మిస్టరీ బౌలింగ్ గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా, ఈ ఆటగాడు అతని బ్యాట్ బలంపై అందరి నోట్లో నానుతున్నాడు. సునీల్ నరైన్ టాప్ ఆర్డర్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. అతని క్లీన్ హిట్టింగ్ తరచుగా ప్రత్యర్థి జట్లను మోకరిల్లేలా చేస్తుంది. ఇటీవల, సునీల్ నరైన్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. తన జట్టు కొమిల్లా విక్టోరియన్స్‌ను ఛాంపియన్‌గా మార్చాడు. ప్రస్తుతం ట్రినిడాడ్ టీ10 బ్లాస్ట్(Trinidad T10 Blast)లో సునీల్ నరైన్ బ్యాట్ రెచ్చిపోతోంది. స్కోవా కింగ్స్ తరఫున ఆడుతున్న సునీల్ నరైన్ కేవలం 22 బంతుల్లోనే అజేయంగా 68 పరుగులు చేశాడు.
అత్యంత వేగంగా బ్యాటింగ్ చేసిన సునీల్ నరైన్ కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. నరైన్ తన ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు. అంటే నరేన్ బౌండరీలోనే 68 పరుగులకుగాను 60 పరుగులు చేశాడు. సునీల్ నరైన్ స్ట్రైక్ రేట్ 309గా నిలిచింది. అతనితో పాటు జాసన్ మహ్మద్ కూడా తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. జాసన్ 33 బంతుల్లో 11 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేశాడు.
స్కోవా కింగ్స్‌కు భారీ విజయం..
తొలుత బ్యాటింగ్ చేసిన స్కోవా కింగ్స్ 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు చేసింది. లియోనార్డో జూలియన్ 9 బంతుల్లో 21 పరుగులు చేశాడు. అతను అవుట్ అయిన తర్వాత, జాసన్ మహ్మద్‌తో కలిసి సునీల్ నరైన్ కొక్రికో కావలీర్స్ బౌలర్లను చెదరగొట్టాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు కలిసి 19 సిక్సర్లు బాదారు. వీరిద్దరి మధ్య కేవలం 48 బంతుల్లోనే 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కోకిరో కావలీర్స్ జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెడియన్ రేమండ్ 2 ఓవర్లలో 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
నికోలస్ పూరన్-ఎవిన్ లూయిస్ కూడా విధ్వంసం..
సునీల్ నరైన్, జాసన్ మహ్మద్ కంటే ముందు, నికోలస్ పూరన్, ఎవిన్ లూయిస్ కూడా T10 బ్లాస్ట్‌లో తుఫాన్ బ్యాటింగ్ చేశారు. నికోలస్ పూరన్ లెదర్‌బ్యాక్ జెయింట్స్ తరఫున ఆడుతూ కేవలం 37 బంతుల్లో అజేయంగా 101 పరుగులు చేశాడు. తన సెంచరీలో పూరన్ 10 సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. టీ10 బ్లాస్ట్‌లో ఎవిన్ లూయిస్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. కేవలం 12 బంతుల్లోనే లూయిస్ హాఫ్ సెంచరీ సాధించాడు. లూయిస్ 17 బంతుల్లో 8 సిక్సర్లు బాది జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించాడు.
Rohit Sharma Lamborghini: ఖరీదైన కారు కొన్న టీమిండియా సారథి.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..