సన్నీ మెచ్చిన టీమిండియా కీపర్.. రాబోయే రోజుల్లో కాబోయే బెస్ట్ కెప్టెన్ అంటూ ప్రశంసలు

|

May 13, 2021 | 9:05 PM

Sunil Gavaskar Believes: రిషభ్‌ పంత్‌ పై ప్రసంశల జల్లు కురిపించాడు క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌. రాబోయే రోజుల్లో ఆ జట్టుకు ఇతనే సారథి అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. జట్టును గెలిపించాలన్న జ్వాల..

సన్నీ మెచ్చిన టీమిండియా కీపర్.. రాబోయే రోజుల్లో కాబోయే బెస్ట్ కెప్టెన్ అంటూ ప్రశంసలు
Sunil Gavaskar Believes
Follow us on

రిషభ్‌ పంత్‌ పై ప్రసంశల జల్లు కురిపించాడు క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌. రాబోయే రోజుల్లో ఆ జట్టుకు ఇతనే సారథి అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. జట్టును గెలిపించాలన్న జ్వాల, నేర్చుకొనే తపన అతడిలో కనిపించాయని అన్నాడు.  ఫ్యూచర్ కెప్టెన్ అనడంలో సందేహం లేదని జోస్యం చెప్పారు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను రిషభ్  చక్కగా ముందుకు నడిపించాడని పేర్కొన్నారు.

IPL 2021 ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఈ ఏడాది ఢిల్లీని రిషభ్ పంత్‌ నడిపించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ గాయపడటంతో పంత్‌కు ఆ అవకాశం దక్కింది. దీనిని పంత్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. 8 మ్యాచుల్లో 6 విజయాలు సొంతం చేసుకున్నాడు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో తీసుకెళ్లాడు. అంతేకాకుండా సారథిగా చేసిన పొరపాట్లను సరిదిద్దుకొంటూ చాలా నేర్చుకున్నాడు.  సన్నీ చేసిన విశ్లేషకులను చాలా మంది  ఆకట్టుకుంటోంది.

‘యువ రిషభ్ సారథ్యంలో ఢిల్లీ నిలబడింది. ప్రతిసారీ నాయకత్వం గురించి ప్రశ్నించే సరికి ఆరో మ్యాచుకే అతడు విసిగిపోవడం మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రతి మ్యాచ్‌ తర్వాత అతడిని ఇదే ప్రశ్న అడుగుతున్నారు. చూసొచ్చేందుకు అనుమతిస్తే కాల్చొచ్చేందుకు సిద్దంగా ఉంటానన్న జ్వాలను అతడు ప్రదర్శించాడు. అవును, సారథిగా కొన్ని తప్పులు చేశాడు. కానీ, పొరపాట్లు చేయని సారథి ఎవరుంటారు?’ అని సన్నీ అన్నారు.

‘పొరపాట్ల నుంచి నేర్చుకొనే తత్వం రిషభ్‌లో కనిపించింది. చాలా సందర్భాల్లో అతడు ప్రత్యర్థి కన్నా ముందున్నాడు. జట్టును నడిపించేందుకు తనవైన దారులు వెతికాడు. అతడు భవిష్యత్తు సారథుల్లో ఒకరు. అందులో సందేహమే లేదు. ప్రతిభకు అవకాశం వచ్చినప్పుడు.. వినియోగించుకోవడానికి కావాల్సిన టెంపర్‌మెంట్‌ అతడిలో ఉంది’ అని సన్నీ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : Yuzvendra Chahal: క్రికెట‌ర్ చాహాల్ పేరెంట్స్‌కు క‌రోనా పాజిటివ్‌.. ఎమోష‌న్ పోస్ట్ చేసిన భార్య‌..

PM Modi: కరోనా నియంత్రణపై క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు మోదీ ఫ్లాన్.. ఈ నెల 18, 20న జిల్లా కలెక్టర్లతో సమావేశం..!