శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరం కానున్నాడు. దీంతో లంకతో సిరీస్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ మరోసారి ఎంపికయ్యాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో టీమిండియాపై పేలవ ప్రదర్శన కనబర్చిన మిచెల్ మార్ష్‌ను జట్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో కూపర్ కొన్నోలీకి అవకాశం ఇచ్చారు.
ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉండగా.. మార్నస్ లబూషేన్ మూడో స్థానంలో.. అలాగే స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ మిడిల్ ఆర్డర్‌లో బలాన్ని చేకూర్చనున్నారు. వికెట్ కీపర్లుగా అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్ జట్టులో ఉండగా, బౌలర్లుగా షాన్ అబాట్, స్కాట్ బోలాండ్, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్నారు. మరి శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు ఎలా ఉందంటే..
ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), షాన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్ (వైస్ కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబూషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్స్వీ , టాడ్ మర్ఫీ, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.
శ్రీలంక వేదికగా జనవరి 29 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు జరగనుండగా, ఈ మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియా టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సిరీస్‌లో శ్రీలంక జట్టు విజయం సాధించినా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోలేదు. ఇప్పటికే ఫైనల్లోకి అడుగుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు.. జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి