Video: బాంబు పేలుళ్ల నుంచి తప్పించుకున్నాడు.. కట్‌చేస్తే.. 10 బంతుల్లో బీభత్సం.. 340 స్ట్రైక్ రేట్‌తో ఉతికేశాడు భయ్యో

Dasun shanaka: UAE లీగ్ ILT20 16వ మ్యాచ్ దుబాయ్ క్యాపిటల్స్ వర్సెస్ గల్ఫ్ జెయింట్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో, దుబాయ్ జట్టు 5 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఇందులో శ్రీలంక క్రికెటర్ దసున్ షనక కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అతను 340 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు.

Video: బాంబు పేలుళ్ల నుంచి తప్పించుకున్నాడు.. కట్‌చేస్తే.. 10 బంతుల్లో బీభత్సం.. 340 స్ట్రైక్ రేట్‌తో ఉతికేశాడు భయ్యో
Dasun Shanaka Scores 34 Run

Updated on: Jan 24, 2025 | 10:55 AM

Dasun Shanaka: ప్రస్తుతం, UAE లీగ్ ILT20లో గ్రూప్ దశ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 16వ మ్యాచ్ దుబాయ్ క్యాపిటల్స్ వర్సెస్ గల్ఫ్ జెయింట్స్ మధ్య దుబాయ్‌లో జరిగింది. జనవరి 23 గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో దుబాయ్ జట్టు 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇందులో శ్రీలంక ఆల్ రౌండర్ దసున్ షనక కీలక పాత్ర పోషించాడు. అతను 10 బంతుల్లో 34 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి తన జట్టును సులభంగా గెలిపించాడు. ఈ అజేయ ఇన్నింగ్స్‌లో అతను సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోయాడు. శ్రీలంకలో ఈస్టర్ సందర్భంగా జరిగిన బాంబు పేలుడులో తృటిలో తప్పించుకున్న క్రికెటర్ ఇతనే కావడం గమనార్హం.

షనక తుఫాన్ బ్యాటింగ్..

తొలుత బ్యాటింగ్ చేసిన గల్ఫ్ జెయింట్స్ జట్టు 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం దుబాయ్ జట్టు 110 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇప్పుడు 23 బంతుల్లో 44 పరుగులు చేయాల్సి ఉంది. దుబాయ్‌లోని కష్టతరమైన పిచ్‌పై ఈ పరుగులు చేయడం కష్టంగా అనిపించింది. తర్వాత దసున్ షనక బ్యాటింగ్‌కు వచ్చాడు. అతని తర్వాత బ్యాట్స్‌మెన్ ఎవరూ మిగలలేదు. తర్వాత అతను 10 బంతుల్లో 340 స్ట్రైక్ రేట్‌తో వేగంగా 34 పరుగులు చేశాడు. ఇది చాలా ముఖ్యమైనదని నిరూపితమైంది. ఈ సమయంలో, అతను 3 ఫోర్లు, 3 సిక్సర్లు కూడా కొట్టాడు. అతని జట్టు 8 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను సులభంగా గెలుచుకుంది.

2019లో ఈస్టర్ సందర్భంగా శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 300 మంది మృతి చెందగా, 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో షనక కుటుంబం కూడా బలి అయింది. దీంతో అతని తల్లి, అమ్మమ్మలకు గాయాలయ్యాయి. అయితే, అతను తృటిలో తప్పించుకున్నాడు. ఒక ఇంటర్వ్యూలో, ఇది తన జీవితంలో భయంకరమైన అనుభవంగా అభివర్ణించాడు. దానిని తాను ఎప్పటికీ మరచిపోలేనని చెప్పుకొచ్చాడు.

హీరో ఆఫ్‌ ద మ్యాచ్‌..

అయితే, షనక ముందు షాయ్ హోప్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గల్ఫ్ జెయింట్స్‌పై 154 పరుగుల ఛేజింగ్‌లో దుబాయ్ జట్టు కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 25 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రెండో వికెట్ కూడా 41 పరుగుల వద్ద, మూడో వికెట్ 60 వద్ద పడిపోయింది. నిర్ణీత వ్యవధిలో బ్యాట్స్‌మెన్ ఔట్ అవుతున్న సమయంలో, హోప్ ఒక ఎండ్‌లో ఉండి పరుగులు చేస్తూనే ఉన్నాడు.

హోప్ 39 బంతుల్లో 47 పరుగులు చేసి జట్టు స్కోరును 110కి తీసుకెళ్లిన తర్వాత ఔటయ్యాడు. ఆ తర్వాత, మిగిలిన పనిని షనక, జట్టు కెప్టెన్ సికందర్ రజా పూర్తి చేశారు. షనక 10 బంతుల్లో 34 పరుగులు చేయగా, రజా 173 స్ట్రైక్ రేట్‌తో 15 బంతుల్లో 26 పరుగులు చేసి ఫాన్సీని సులభంగా గెలిపించాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో హోప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..