PAK vs SL: పాకిస్థాన్‌పై తుఫాన్ సెంచరీ.. కట్‌చేస్తే.. ఆసుపత్రిలో చేరిన శ్రీలంక బ్యాటర్.. కారణం ఏంటంటే?

పాకిస్థాన్‌పై కుశాల్ మెండిస్ కేవలం 65 బంతుల్లోనే సెంచరీ మార్కును చేరుకున్నాడు. తద్వారా ప్రపంచకప్‌లో శ్రీలంక తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా కుశాల్ మెండిస్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు కుమార సంగక్కర పేరిట ఉండేది. 2015 ప్రపంచ కప్‌లో కుమార సంగక్కర 70 బంతుల్లో సెంచరీ సాధించాడు. కానీ, ఇప్పుడు కుశాల్ మెండిస్ తన మాజీ కెప్టెన్‌ను విడిచిపెట్టాడు. పాకిస్థాన్‌పై కుశాల్ మెండిస్‌తో పాటు సదీర సమరవిక్రమ సెంచరీ మార్కును అధిగమించాడు.

PAK vs SL: పాకిస్థాన్‌పై తుఫాన్ సెంచరీ.. కట్‌చేస్తే.. ఆసుపత్రిలో చేరిన శ్రీలంక బ్యాటర్.. కారణం ఏంటంటే?
Pak Vs Sl

Updated on: Oct 10, 2023 | 9:47 PM

Kusal Mendis Hospitalized: పాకిస్థాన్‌పై కుశాల్ మెండిస్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. కుశాల్ మెండిస్ 77 బంతుల్లో 122 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. అయితే ఈ అద్భుతమైన సెంచరీ తర్వాత, కుశాల్ మెండిస్ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. దీంతో పాకిస్తాన్ బ్యాటింగ్ సమయంలో మైదానంలోకి దిగలేదు. వాస్తవానికి, కుశాల్ మెండిస్ తిమ్మిర్లతో బాధపడుతున్నాడు. దీంతో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. కుశాల్ మెండిస్ గైర్హాజరీలో దుషన్ హేమంత మైదానంలోకి వచ్చాడు. సదీర సమరవిక్రమ వికెట్‌ కీపర్‌గా నిలిచాడు.

శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటనలో ఏం చెప్పిందంటే?

ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్‌పై అద్భుత సెంచరీ ఆడిన కుశాల్ మెండిస్‌ను వెన్ను, కాళ్ల నొప్పులు, తిమ్మిర్లతో బాధపడుతున్నాడు. ఆసుపత్రికి తరలించినట్లు ఈ ప్రకటనలో తెలిపింది. కాగా, కుశాల్ మెండిస్ స్థానంలో దుషన్ హేమంత మైదానంలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

ప్రపంచకప్‌లో శ్రీలంక తరపున కుశాల్ మెండిస్ ఫాస్టెస్ట్ సెంచరీ..

పాకిస్థాన్‌పై కుశాల్ మెండిస్ కేవలం 65 బంతుల్లోనే సెంచరీ మార్కును చేరుకున్నాడు. తద్వారా ప్రపంచకప్‌లో శ్రీలంక తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా కుశాల్ మెండిస్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు కుమార సంగక్కర పేరిట ఉండేది. 2015 ప్రపంచ కప్‌లో కుమార సంగక్కర 70 బంతుల్లో సెంచరీ సాధించాడు. కానీ, ఇప్పుడు కుశాల్ మెండిస్ తన మాజీ కెప్టెన్‌ను విడిచిపెట్టాడు. పాకిస్థాన్‌పై కుశాల్ మెండిస్‌తో పాటు సదీర సమరవిక్రమ సెంచరీ మార్కును అధిగమించాడు. వీరిద్దరి సెంచరీల కారణంగా శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 344 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్‌కు 345 పరుగుల విజయ లక్ష్యం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..