Video: పాకిస్థాన్ మ్యాచ్‌లో వివాదం.. తొలుత ఔట్.. ఆ తర్వాత నాటౌట్.. కారణం ఏంతో తెలిస్తే షాకే..

|

Oct 04, 2024 | 1:28 PM

PAK vs SL: యూఏఈలో మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది. తొలిరోజే పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్‌లో పెద్ద దుమారమే రేగింది. వాస్తవానికి, శ్రీలంక బ్యాట్స్‌మెన్ నీలాక్షి డిసిల్వా మొదట నష్రా సంధు బంతికి ఔటైంది. దీంతో వెంటనే అంపైర్లు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని డెడ్ బాల్‌గా ప్రకటించారు. ఎందుకంటే బౌలింగ్ చేస్తున్నప్పుడు నష్రా సంధు చేతి రుమాలు పడిపోయింది. దీంతో నీలాక్షి ఔట్ కాలేదు.

Video: పాకిస్థాన్ మ్యాచ్‌లో వివాదం.. తొలుత ఔట్.. ఆ తర్వాత నాటౌట్.. కారణం ఏంతో తెలిస్తే షాకే..
Pak Vs Sl Dead Ball Issue
Follow us on

Dead Ball Decision During PAK vs SL Match: యూఏఈలో మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది. తొలిరోజే పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్‌లో పెద్ద దుమారమే రేగింది. వాస్తవానికి, శ్రీలంక బ్యాట్స్‌మెన్ నీలాక్షి డిసిల్వా మొదట నష్రా సంధు బంతికి ఔటైంది. దీంతో వెంటనే అంపైర్లు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని డెడ్ బాల్‌గా ప్రకటించారు. ఎందుకంటే బౌలింగ్ చేస్తున్నప్పుడు నష్రా సంధు చేతి రుమాలు పడిపోయింది. దీంతో నీలాక్షి ఔట్ కాలేదు. అంపైర్ల ఈ నిర్ణయంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. అంపైర్లు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలుసా?

క్రికెట్‌లో హ్యాండ్‌కర్చీఫ్‌కు సంబంధించిన నిబంధనల గురించి తెలుసుకునే ముందు, పాకిస్తాన్, శ్రీలంక మధ్య మ్యాచ్‌లో ఏమి జరిగిందో తెలుసుకోవడం ముఖ్యం. తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 116 పరుగులకే పరిమితమైంది. ఛేదనలో శ్రీలంక 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో నీలాక్షి డిసిల్వా ఉండగా, 13వ ఇన్నింగ్స్‌లో తొలి బంతికి నష్రా సంధు బౌలింగ్‌కు వచ్చింది.

నష్రా బంతి విసురుతుండగా ఆమె చేతి రుమాలు మైదానంలో పడిపోయింది. నీలాక్షి ఈ బంతిని స్వీప్ చేయడానికి ప్రయత్నించింది. కానీ, ఆమె బంతిని మిస్ చేసి ఎల్‌బీడబ్ల్యు అప్పీల్ చేయడంతో ఔటైంది. ఈ క్రమంలో చేతి రుమాలు పడిపోవడంపై అంపైర్‌కు ఫిర్యాదు చేసింది. థర్డ్ అంపైర్ సలహా తీసుకున్న తర్వాత, ఈ బంతిని డెడ్ బాల్‌గా ప్రకటించారు. దీంతో లంక ప్లేయర్ ఔట్ కాలేదు. ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. షాట్ ఆడినందుకే బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేసి ఉండాల్సిందని కొందరు అభిమానులు అంటున్నారు.

రుమాలు విషయంలో రూల్స్?

MCC నిబంధనలలోని క్లాజ్ 20.4.2.6 ప్రకారం, స్ట్రైక్‌లో నిలబడిన బ్యాటర్ బంతిని ఆడే ముందు ఏదైనా శబ్దం లేదా కదలిక లేదా మరేదైనా కారణంతో పరధ్యానంలో ఉంటే, అది డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు. నీలాక్షి విషయంలో కూడా అదే జరిగింది. ఆమె షాట్ ఆడకముందే పాక్ బౌలర్ చేతి రుమాలు పడిపోయింది. అయితే, దీని వల్ల పాకిస్థాన్‌కు పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తాజాగా కౌంటీ ఛాంపియన్‌షిప్‌లోనూ ఇలాంటి ఘటనే..

తాజాగా కౌంటీ ఛాంపియన్ షిప్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సోమర్‌సెట్, హాంప్‌షైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కైల్ అబాట్ బౌలింగ్‌లో షోయబ్ బషీర్ అవుటయ్యాడు. కానీ, అబాట్ చేతి రుమాలు పడిపోవడంతో ఆ బంతిని డెడ్ బాల్‌గా పరిగణించి నాటౌట్‌గా ప్రకటించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..