Vaibhav Suryavanshi : వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ… 386 రోజుల కసి.. సన్‌రైజర్స్‌పై పగ తీర్చుకుంటాడా?

SRH vs RR: ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టిస్తున్నాడు. 386 రోజుల పాత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ రాజస్థాన్ స్టార్ సిద్ధమయ్యాడు. వరల్డ్ నంబర్ 1 బ్యాటర్ అభిషేక్ శర్మతో తలపడనున్నాడు. ఉప్పల్ స్టేడియంలో ఈ రోజు పరుగుల వరద పారడం ఖాయం.

Vaibhav Suryavanshi : వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ... 386 రోజుల కసి.. సన్‌రైజర్స్‌పై పగ తీర్చుకుంటాడా?
Vaibhav Suryavanshi

Updated on: Apr 13, 2026 | 1:16 PM

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు వినిపిస్తోంది.. అదే వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న ఈ 15 ఏళ్ల కుర్రాడు తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న పోరులో వైభవ్ ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. గతేడాది హైదరాబాద్ చేతిలో రాజస్థాన్ ఎదుర్కొన్న ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని, ఆ 386 రోజుల కసిని ఈ మ్యాచ్‌తో తీర్చుకోవాలని వైభవ్ పట్టుదలతో ఉన్నాడు.

గత ఐపీఎల్ సీజన్‌లో అంటే మార్చి 23, 2025న హైదరాబాద్, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత భారీ స్కోర్ల మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచింది. ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 286 పరుగులు చేయగా, రాజస్థాన్ 242 పరుగుల వద్దే ఆగిపోయింది. ఆ ఓటమి రాజస్థాన్ రాయల్స్ జట్టును, అభిమానులను ఎంతో బాధించింది. ఆ 386 రోజుల పాత గాయాన్ని మాన్పించేందుకు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు కవచంలా నిలబడబోతున్నాడు. గతేడాది మ్యాచ్‌లో వైభవ్ లేడు, కానీ ఈసారి తన విధ్వంసకర బ్యాటింగ్‌తో హైదరాబాద్ కోటను కొల్లగొట్టాలని చూస్తున్నాడు.

ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్య పోరు మాత్రమే కాదు, ఇద్దరు విధ్వంసకర లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల మధ్య యుద్ధం. టీ20 క్రికెట్‌లో వరల్డ్ నంబర్ 1 బ్యాటర్ అయిన అభిషేక్ శర్మను వైభవ్ తొలిసారి ఐపీఎల్ పిచ్‌పై ఎదుర్కోబోతున్నాడు. ఇద్దరి శైలి ఒకటే.. క్రీజులోకి రాగానే బౌలర్లపై విరుచుకుపడటం. ఈ ఇద్దరిలో పవర్ ఎవరికి ఎక్కువ? ఎవరి దూకుడు బౌలర్లను వణికిస్తుంది? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ మ్యాచ్ ద్వారా ఇద్దరు యువ కెరటాల సత్తా ఏంటో తేలిపోనుంది.

ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 266.66 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 200 పరుగులు చేశాడు. ఇందులో అత్యధికంగా 18 సిక్సర్లు ఉండటం విశేషం. మరోవైపు అభిషేక్ శర్మ 4 మ్యాచ్‌ల్లో 218.64 స్ట్రైక్ రేట్‌తో 129 పరుగులు చేసి, 13 సిక్సర్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్, పవర్ హిట్టింగ్‌లో వైభవ్ ప్రస్తుతానికి ముందంజలో ఉన్నాడు. సన్‌రైజర్స్ బౌలింగ్ ఎటాక్‌ను వైభవ్ ఎలా ఎదుర్కొంటాడనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. అటువంటి పిచ్‌పై వైభవ్ లాంటి కుర్రాడు రెచ్చిపోతే పరుగుల వరద పారడం ఖాయం. అటు అభిషేక్ శర్మ కూడా తన హోమ్ గ్రౌండ్‌లో చెలరేగిపోయే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఓపెనింగ్‌లో వైభవ్ ఇచ్చే ఆరంభం మీదనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై వైభవ్ తొలిసారి ఆడుతుండటంతో, ఈ మ్యాచ్ అతని కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us