PBKS vs SRH Records: ముల్లాన్‌పూర్‌లో కాటేరమ్మ కోడుకుల బీభత్సం.. ఐపీఎల్ హిస్టరీకే పిచ్చెక్కించారుగా..

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించారు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జోడీ ఆకాశమే హద్దుగా చెలరేగి, పవర్ ప్లేలోనే ప్రత్యర్థి బౌలింగ్‌ను ముక్కలు చేసింది. కేవలం 8.1 ఓవర్లలోనే 120 పరుగులు జోడించి, పాత రికార్డులను తిరగరాస్తూ సరికొత్త రికార్డులను నెలకొల్పింది.

PBKS vs SRH Records: ముల్లాన్‌పూర్‌లో కాటేరమ్మ కోడుకుల బీభత్సం.. ఐపీఎల్ హిస్టరీకే పిచ్చెక్కించారుగా..
Abhishek Sharma Travis Head Records

Updated on: Apr 11, 2026 | 5:56 PM

ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ పోరులో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడటంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. కేవలం మొదటి ఆరు ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 105 పరుగులు సాధించి, ఈ మైదానంలోనే అత్యధిక పవర్ ప్లే స్కోరును నమోదు చేశారు. గతంలో ఉన్న అన్ని రికార్డులను చెరిపివేస్తూ ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనలలో ఒకటిగా నిలిచారు.

వేగవంతమైన శతకం: సన్‌రైజర్స్ సరికొత్త చరిత్ర..

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 5.5 ఓవర్లలోనే జట్టు స్కోరును 100 పరుగుల మార్కును దాటించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా వంద పరుగులు సాధించిన మూడవ జట్టుగా హైదరాబాద్ నిలిచింది. అంతకుముందు కూడా ఢిల్లీ, లక్నో జట్లపై సన్‌రైజర్స్ ఇటువంటి ప్రదర్శనలే చేసినప్పటికీ, ముల్లాన్‌పూర్ పిచ్‌పై ఈ తరహా విధ్వంసం అందరినీ ఆశ్చర్యపరిచింది. అభిషేక్ శర్మ దూకుడుకు తోడు హెడ్ అనుభవం తోడవడంతో పంజాబ్ జట్టు పూర్తిగా చేతులెత్తేసింది.

భారీ భాగస్వామ్యాలు: ధావన్-వార్నర్ రికార్డుకు చేరువలో..

ఐపీఎల్‌లో అత్యధిక సార్లు వంద పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీల జాబితాలో అభిషేక్-హెడ్ ద్వయం దూసుకుపోతోంది. తాజా ఇన్నింగ్స్‌తో వీరిద్దరూ ఐదు సార్లు సెంచరీ భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. తద్వారా విరాట్ కోహ్లీ-ఫాఫ్ డుప్లెసిస్, వార్నర్-బెయిర్‌స్టోల రికార్డులను సమం చేశారు. మరో ఒక్క సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పితే, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ పేరిట ఉన్న ఆరు సెంచరీ భాగస్వామ్యాల ఆల్ టైమ్ రికార్డును వీరు అధిగమించనున్నారు.

ముల్లాన్‌పూర్ స్టేడియంలో నమోదైన రికార్డులు..

అత్యధిక పవర్ ప్లే స్కోరు (ముల్లాన్‌పూర్): 105/0 (సన్‌రైజర్స్)

వేగవంతమైన టీం సెంచరీ: 5.5 ఓవర్లలో (ఐపీఎల్ చరిత్రలో 3వ స్థానం)

2026 సీజన్ అత్యధిక పవర్ ప్లే స్కోరు: 105/0

హైదరాబాద్ ఓపెనర్ల ఈ ప్రదర్శనతో పంజాబ్ బౌలింగ్ విభాగం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ జట్టు తమ దూకుడును ఇదే రీతిలో కొనసాగిస్తూ టైటిల్ దిశగా అడుగులు వేస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us