
Sunrisers Hyderabad vs Punjab Kings: ఈరోజు ఐపీఎల్ 15 చివరి లీగ్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ టీం నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు సాధించింది. దీంతో పంజాబ్ ముందు 158 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. హైదరాబాద్ తరపున ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అత్యధిక పరుగులు చేశాడు. అతను 32 బంతులు ఎదుర్కొని 43 పరుగులు చేశాడు. అదే సమయంలో, వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్ చివరి ఓవర్లో బ్యాటింగ్ చేసి కేవలం 29 బంతుల్లో 58 పరుగులు జోడించారు.
హర్‌ప్రీత్ అద్భుతమైన బౌలింగ్..
ఈ మ్యాచ్‌లో హర్‌ప్రీత్ బ్రార్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మొదట 20 పరుగుల వద్ద ఉన్న రాహుల్ త్రిపాఠిని అవుట్ చేయగా.. ఆ తర్వాత పూర్తిగా సెట్‌లో ఉన్న అభిషేక్ శర్మ 43 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టాడు. అదే సమయంలో వీరిద్దరూ కాకుండా హర్‌ప్రీత్ ఐడెన్ మార్క్‌రామ్‌ను కూడా అవుట్ చేశాడు. మార్క్రామ్ బ్యాట్ నుంచి 17 బంతుల్లో 21 పరుగులు వచ్చాయి.
రబాడ తొలి దెబ్బ..
ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ప్రియాం గార్గ్.. కగిసో రబాడ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కి క్యాచ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో గార్గ్ కేవలం 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఈ సీజన్‌లో PBKS, SRH జట్లు రెండూ 13 మ్యాచ్‌లు ఆడగా, రెండు జట్లు తలో 6 మ్యాచ్‌లు గెలిచాయి. పంజాబ్ నెట్ రన్ రేట్ -0.043గా ఉండగా, హైదరాబాద్ నెట్ రన్ రేట్ -0.230గా నిలిచింది. దీంతో ఇరు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇటువంటి పరిస్థితిలో, రెండు జట్లు సీజన్‌లోని చివరి మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా IPL 2022కి వీడ్కోలు చెప్పాలనుకుంటున్నాయి.
SRH vs PBKS: ప్లేయింగ్ XI..
సన్‌రైజర్స్ హైదరాబాద్: భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, ఐదాన్ మర్క్రమ్, నికోలస్ పూరన్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, జగదీషా సుచిత్, ఫజ్ల్హాక్ ఫరూకీ, రొమారియో షెపర్డ్, ఉమ్రాన్ మాలిక్
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టన్, జితేష్ శర్మ (కీపర్), షారూఖ్ ఖాన్, ప్రేరక్ మన్కడ్, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్
Also Read: IPL 2022: ఐపీఎల్ 2022లో సత్తా చూపినా.. సెలక్టర్లు కరుణించలే.. ఈ ఐదుగురికి మరోసారి తప్పని నిరాశ..