
ఐపీఎల్ 7వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌కు 191 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ 190 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు పడగొట్టాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ట్రావిస్ హెడ్ 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనికేత్ వర్మ 5 సిక్సర్లు బాది 36 పరుగులు చేశాడు. నితీష్ రెడ్డి 32 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 26 పరుగులు చేశారు. ఎల్‌ఎస్‌జీ తరపున ప్రిన్స్ యాదవ్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ రతి తలా ఒక వికెట్ పడగొట్టారు. ఒక బ్యాటర్ రనౌట్ అయ్యాడు.