SRH vs KKR Possible Playing11: ఈరోజు (ఏప్రిల్ 14) IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య పోరు జరగనుంది. ఈ రెండు జట్లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7.30 గంటలకు ముఖాముఖిగా తలపడనున్నాయి. రెండు జట్లూ తమ మునుపటి మ్యాచ్‌లను గెలుపొందాయి. కాబట్టి ఈ జట్లు తమ ప్లేయింగ్-11లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.
జాసన్ రాయ్, లిట్టన్ దాస్ కోల్‌కతా జట్టులోకి వచ్చినా నేటి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేయడం కష్టంగా మారనుంది. కోల్‌కతా జట్టు గత రెండు మ్యాచ్‌లుగా గెలుస్తూనే ఉంది. కాబట్టి కేకేఆర్ ప్లేయింగ్-11ని మార్చడం కష్టమే. ఈ సీజన్‌లో కోల్‌కతా తమ తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ వరుసగా విజయం సాధించింది. మరోవైపు ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ గత మ్యాచ్‌లో సొంతగడ్డపై విజయం సాధించింది.
కోల్‌కతా ప్రాబబుల్ ప్లేయింగ్-11 (మొదటి బ్యాటింగ్): రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఎన్ జగదీషన్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
కోల్‌కతా ప్రాబబుల్ ప్లేయింగ్-11 (బౌలింగ్ ఫస్ట్): రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఎన్ జగదీషన్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ.
హైదరాబాద్ ప్రాబబుల్ ప్లేయింగ్-11 (మొదటి బ్యాటింగ్): మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఈడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, మార్కో యాన్సిన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్.
హైదరాబాద్ ప్రాబబుల్ ప్లేయింగ్-11 (బౌలింగ్ ఫస్ట్): మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఈడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, మార్కో యాన్సిన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..