Sunrisers Hyderabad IPL Auction: ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ ముగిసింది. మొత్తం 292 ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా.. 57 మంది ప్లేయర్స్‌ను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నారు. ఇందులో పలువురు ప్లేయర్స్ అనూహ్యంగా భారీ ధర పలికారు. కొంతమంది సీనియర్ ఆటగాళ్లు మాత్రం తక్కువ ధరకు అమ్ముడుపోయారు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ విషయానికి వస్తే.. ఈ వేలంలో కేవలం మూడు ఆటగాళ్లనే సొంతం చేసుకుంది. అదీ కూడా అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ కేదార్ జాదవ్‌ను దక్కించుకోవడం జరిగింది.
అసలే గతేడాది చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన కేదార్ జాదవ్ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు కనబరచలేదు. ఆదుకోవాల్సిన సమయంలో కూడా చెన్నై టీమ్‌కు కేదార్ అండగా నిలబడలేకపోయాడు. దీనితో ఐపీఎల్ 2021లో కేదార్ జాదవ్ ఎలా రాణిస్తాడన్నది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), బెయిర్‌స్టో, విలియమ్సన్, మనీష్ పాండే, ప్రియం గార్గ్, విజయ్ శంకర్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, మిచెల్ మార్ష్, రషీద్ ఖాన్, అబిషేక్ శర్మ, నబీ, సాహా, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, నదీమ్, గోస్వామి, ఖలీల్ అహ్మద్, బసిల్ తంపి, విరాట్ సింగ్
కొత్తగా టీమ్‌లోకి వచ్చిన ఆటగాళ్లు: సుచిత్, కేదార్ జాదవ్, ముజీబ్ రెహమాన్