Watch Video: కావ్యాపాప అందానికి అభిమాని ఫిదా.. పెళ్లి చేసుకోవాలంటూ లైవ్ మ్యాచ్‌లో ప్రపోజల్..

|

Jan 20, 2023 | 12:27 PM

Kaviya Maran: SA20 లీగ్‌లో మొత్తం 6 IPL ఫ్రాంచైజీలు జట్లను కొనుగోలు చేశాయి. వాటిలో ఒకటి సన్‌రైజర్స్. ఆ జట్టు సీఈవో కావ్య మారన్ జనవరి 19న మ్యాచ్‌ని చూసేందుకు దక్షిణాఫ్రికాకు వెళ్లింది.

Watch Video: కావ్యాపాప అందానికి అభిమాని ఫిదా.. పెళ్లి చేసుకోవాలంటూ లైవ్ మ్యాచ్‌లో ప్రపోజల్..
Kavya Maran
Follow us on

ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్యా మారన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఐపీఎల్ వచ్చేసిందంటే.. కావ్యా మారన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారుతుంటుంది. ప్రస్తుతం ఐపీఎల్ వేలం ముగింసింది. ఇప్పుడెందుకు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుందనే కదా మీ డౌట్.. అక్కడికే వస్తున్నాం. మనదేశంలోనే కాదు, ప్రస్తుతం సౌతాఫ్రికాలోనే మినీ ఐపీఎల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ ఫ్రాంచైజీలే అక్కడ కూడా కొన్ని జట్లను కొనుగోలు చేయడంతో.. అదే పేర్లతో అక్కడ ఎస్ఏ20 లీగ్ నిర్వహిస్తు్న్నారు.
దక్షిణాఫ్రికాలో ప్రారంభమైన ఈ కొత్త టీ20 లీగ్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ కూడా ఒక జట్టును కొనుగోలు చేశారు. ఈ లీగ్‌లో మొత్తం 6 IPL ఫ్రాంచైజీలు జట్లను కొనుగోలు చేశాయి. వాటిలో ఒకటి సన్‌రైజర్స్. SA20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ మ్యాచ్ జనవరి 19 సాయంత్రం పార్ల్ రాయల్స్‌తో జరిగింది. అసలు అక్కడే జరిగింది విశేషం.

కావ్య మారన్‌కు ప్రపోజల్..

పార్ల్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ మ్యాచ్ చూసేందుకు కావ్య మారన్ కూడా స్టేడియానికి చేరుకున్నారు. ఈ మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ ఇన్నింగ్స్ 8 వ ఓవర్ పూర్తయింది. అయితే అకస్మాత్తుగా కెమెరాకు ఓ లవ్ ప్రపోజల్ కనిపించింది. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.

చూడగానే గుండె జారిపోయింది- పెళ్లి చేసుకోవా అంటూ..

దక్షిణాఫ్రికాకు చెందిన ఓ అభిమాని కావ్య మారన్‌కు లవ్ ప్రపోజల్ అందించాడు. సన్‌రైజర్స్ జట్టు యజమాని అందానికి ముగ్ధుడైన ఈ అభిమాని.. ఏకంగా పెళ్లి చేసుకోవా అంటూ ప్రతిపాదనలు పంపించాడు. దక్షిణాఫ్రికాకు చెందిన కావ్య మారన్ ప్రేమికుడి వీడియో తాజాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

కావ్య మారన్ తన అందంతో దక్షిణాఫ్రికా అభిమానుల హృదయాన్ని గెలుచుకుంది. ఆమె జట్టు కూడా వరుస విజయాలతో లీగ్‌లో దూసుకపోతోంది. పార్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 127 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ ఈస్టన్ క్యాప్ 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..