
దక్షిణాఫ్రికాకు చెందిన వెటరన్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ IPL ప్రారంభానికి ముందు లక్నో సూపర్‌జెయింట్స్ క్యాంప్‌లో కనిపించాడు. అదే సమయంలో, అతను అయోధ్యలోని రామమందిరాన్ని కూడా సందర్శించి, మహారాజ్ శ్రీరాముని దర్శనం పొందాడు. అనంతరం ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడీ స్టార్ స్పిన్నర్. అంతకుముందు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజున సామాజిక మాధ్యమాల ద్వారా భారతీయులందరికి శుభాకాంక్షలు తెలిపాడీ దక్షిణాఫ్రికా క్రికెటర్. తాను తదుపరిసారి భారతదేశాన్ని సందర్శించినప్పుడు కచ్చితంగా శ్రీరాముని దర్శనం చేసుకుంటానని చెప్పాడు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు అయోధ్యను సందర్శించాడు కేశవ్ మహారాజ్. బలరామునికి ప్రత్యేక పూజలు చేశాడు. కాగా భారత సంతతికి చెందిన కేశవ్ మహారాజ్ కు హిందూ సంప్రదాయాలు, ఆచారాలన్నా బాగా ఆసక్తి చూపిస్తాడు. గతేడాది దక్షిణాఫ్రికా జట్టు సిరీస్ ఆడేందుకు భారత్ వచ్చినప్పుడు కేశవ్ మహరాజ్ తిరువనంతపురంలోని ప్రముఖ దేవాలయం పద్మనాభస్వామి మందిరాన్ని సందర్శించాడు. అక్కడి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పుడు అయోధ్యను సందర్శించి శ్రీరాముని దర్శనం పొందాడు. ప్రస్తుతం బలరాముని దర్శించుకుంటున్న కేశవ్ మహారాజ్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.
ఇక కేశవ్ మహారాజ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికా తరఫున 127 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి మొత్తం 237 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టుకు నాయకత్వం వహించిన మహరాజ్ ఈ ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు. అయితే ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ క్యాంపులో కనిపించడం విశేషం
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్ ద్వారా తమ ఐపీఎల్ 2024 సీజన్‌ను ప్రారంభించనుంది లక్నో సూపర్ జెయింట్స్ రాజస్థాన్‌లోని జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
కేఎల్ రాహుల్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), క్వింటన్ డి కాక్, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, దేవదత్ పడిక్కల్, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, యశ్ థాకూర్ , ప్రేరక్ మన్కడ్, అమిత్ మిశ్రా, మయాంక్ యాదవ్, షమర్ జోసెఫ్, మొహ్సిన్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్, అర్షిన్ కులకర్ణి, శివమ్ మావి, ఎం సిద్ధార్థ్, డేవిడ్ విల్లీ, అష్టన్ టర్నర్, మహ్మద్ అర్షద్ ఖాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..