
IND vs SA 2nd ODI: భారత్ వర్సెస్ద క్షిణాఫ్రికా మధ్య రెండవ వన్డే ఈరోజు రాయ్‌పూర్‌లో జరుగుతుంది. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలి వన్డేకు దూరమైన కెప్టెన్ టెంబా బావుమా తిరిగి వచ్చాడు. దక్షిణాఫ్రికా జట్టులో మూడు మార్పులు జరిగాయి. బావుమాతో పాటు, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి తిరిగి వచ్చారు. భారత జట్టులో ఎటువంటి మార్పులు లేవు. కాగా, భారత జట్టు వరుసగా 20వ సారి వన్డేల్లో టాస్ ఓడిపోయింది. కేఎల్ రాహుల్ కూడా ఈ సమస్యకు బాధితుడిలా మారిపోయాడు.
కాగా, రాయ్‌పూర్‌లో భారత్ ఎప్పుడూ వన్డేలో ఓడిపోలేదు. రాయ్‌పూర్‌లో ఇప్పటివరకు ఒకే ఒక వన్డే మ్యాచ్ జరిగింది. జనవరి 2023లో, భారత్ న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య 59 వన్డేలు తలపడ్డాయి. భారత్ 28 మ్యాచ్‌లలో గెలిచింది, దక్షిణాఫ్రికా 30 మ్యాచ్‌లలో గెలిచింది. ఒక మ్యాచ్ కూడా తుది ఫలితం తేలలేదు. భారతదేశంలో ఆడిన 25 మ్యాచ్‌లలో, టీమ్ ఇండియా 15 మ్యాచ్‌లలో, దక్షిణాఫ్రికా 10 మ్యాచ్‌లలో గెలిచింది.
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), ఐడెన్ మార్క్‌రామ్, టెంబా బావుమా(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లుంగి ఎన్గిడి.
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్/కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..