SA vs USA: పోరాడి ఓడిన అమెరికా.. 18 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం..

|

Jun 19, 2024 | 11:26 PM

United States vs South Africa, 41st Match, Super 8 Group 2: టీ-20 వరల్డ్‌కప్‌ సూపర్‌-8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు పోరాడిన అమెరికా 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. అమెరికా తరపున గౌస్ 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

SA vs USA: పోరాడి ఓడిన అమెరికా.. 18 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం..
Sa Vs Usa Result
Follow us on

United States vs South Africa, 41st Match, Super 8 Group 2: టీ-20 వరల్డ్‌కప్‌ సూపర్‌-8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు పోరాడిన అమెరికా 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. అమెరికా తరపున గౌస్ 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో టాస్ గెలిచిన అమెరికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే క్వింటన్ డి కాక్ వేగంగా అర్ధశతకం సాధించి జట్టుకు శుభారంభాన్ని అందించాడు.

ఒకానొక సమయంలో డికాక్, మార్క్రమ్ (46 పరుగులు) భాగస్వామ్యానికి దక్షిణాఫ్రికా జట్టు 200 పరుగుల దిశగా పయనించేలా కనిపించింది. కానీ సౌరభ్ నేత్రవాల్కర్, హర్‌ప్రీత్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టి రన్ రేట్‌ను నియంత్రించారు మరియు దక్షిణాఫ్రికాను 194 పరుగులకే పరిమితం చేశారు.

పరుగుల వేటలో రన్ రేట్‌ను కొనసాగించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది, కానీ పవర్‌ప్లేలో దక్షిణాఫ్రికా కంటే వెనుకబడి ఉంది. అమెరికా 6 ఓవర్లలో 53 పరుగులు చేసినా 2 వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లేలో దక్షిణాఫ్రికా 64 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది.

అమెరికా 19 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఆండ్రియాస్ గాస్, జస్దీప్ సింగ్ ఉన్నారు. గాస్ 33 బంతుల్లో యాభై పరుగులు పూర్తి చేశాడు.

ఇరుజట్ల ప్లేయింగ్ 11..

అమెరికా: షాయన్ జహంగీర్, స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్(కీపర్), ఆరోన్ జోన్స్(కెప్టెన్), నితీష్ కుమార్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, నోస్తుష్ కెంజిగే, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్.

దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్టే, తబ్రైజ్ షమ్సీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..