IPL 2023: 4 రోజుల క్రితం ప్రమోషన్.. కట్ చేస్తే.. సెంచరీతో దుమ్ము రేపిన ఎస్ఆర్‌హెచ్ సారథి.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్..

|

Feb 28, 2023 | 9:08 PM

Sunrisers Hyderabad: ఐడెన్ మార్క్రామ్ దాదాపు ఏడాది తర్వాత ఓపెనర్‌గా దక్షిణాఫ్రికా టెస్టు జట్టులోకి తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే చరిత్ర సృష్టించాడు.

IPL 2023: 4 రోజుల క్రితం ప్రమోషన్.. కట్ చేస్తే.. సెంచరీతో దుమ్ము రేపిన ఎస్ఆర్‌హెచ్ సారథి.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్..
Srh Ipl 2023 Auction
Follow us on

Aiden Markram: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2023కి తమ కొత్త కెప్టెన్‌గా ఐడెన్ మార్క్రామ్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ జట్టు కమాండ్ పొందిన 4 రోజుల తర్వాత మైదానంలో బ్యాట్‌తో రచ్చ చేశాడు. మార్క్రామ్‌ దాదాపు 6 నెలల తర్వాత దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టులో తుఫాను సెంచరీతో బలమైన పునరాగమనం చేశాడు. ఇక్కడే కాదు ఏడాది తర్వాత ఓపెనర్‌గా తిరిగొచ్చాడు. 154 బంతుల్లో టెస్టు కెరీర్‌లో ఆరో సెంచరీ పూర్తి చేశాడు. ఈ సమయంలో అతను 17 ఫోర్లు కొట్టాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో మార్క్రామ్ బౌలర్లను చిత్తు చేశాడు.

మార్క్రామ్ 174 బంతుల్లో 115 పరుగులు చేసి అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అంతకుముందు గతేడాది ఆగస్టులో దక్షిణాఫ్రికా తరపున చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు జట్టులో అవకాశం దక్కించుకోగా, ఆ అవకాశం వచ్చిన వెంటనే జట్టులో కూడా తన ప్రాధాన్యతను నిరూపించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

దక్షిణాఫ్రికాకు బలమైన ఆరంభం..

డీన్ ఎల్గర్‌తో కలిసి మార్క్రామ్ దక్షిణాఫ్రికాకు బలమైన ఆరంభాన్ని అందించాడు. వీరిద్దరి మధ్య 141 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఎల్గర్ 71 పరుగుల వద్ద ఔటైన తర్వాత, మార్క్రామ్ టోనీ డి జార్జితో భాగస్వామ్యాన్ని పంచుకుని స్కోరును 221 పరుగులకు తీసుకెళ్లాడు. టోనీ రూపంలో దక్షిణాఫ్రికాకు మరో దెబ్బ తగిలింది. 2 బంతుల తర్వాత కెప్టెన్ టెంబా బావుమా ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. మార్క్రమ్ రూపంలో దక్షిణాఫ్రికాకు 236 పరుగులకు నాలుగో దెబ్బ తగిలింది.

గత 2 నెలలుగా అద్భుతమైన ఫాంలో..

మార్క్రామ్‌కి గత 2 నెలలు గొప్పగా ఉన్నాయి . మొదట, అతను కెప్టెన్‌గా SA20 లీగ్ 2023 టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్‌ హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా మారాడు. ఇప్పుడు సెంచరీ చేసిన తర్వాత దక్షిణాఫ్రికా టెస్టు జట్టులోకి తిరిగి వచ్చాడు. టెస్టుల్లోనూ అతని అద్భుతమైన ఫామ్ కొనసాగుతోంది. అదే నెలలో అతను SA20 లీగ్ సెమీ-ఫైనల్స్‌లో అదే మైదానంలో 58 బంతుల్లో సెంచరీ చేశాడు. SA20 లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శన అదే ప్రభావాన్ని చూపింది. అతను IPL జట్టుకు కూడా నాయకత్వం వహించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..