IND vs SA: ధోనీ రికార్డును అధిగమించనున్న రిషబ్ పంత్.. 3 వికెట్ల దూరంలో ఉన్న యువ వికెట్ కీపర్..

|

Dec 23, 2021 | 7:19 PM

భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును సమం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు...

IND vs SA: ధోనీ రికార్డును అధిగమించనున్న రిషబ్ పంత్.. 3 వికెట్ల దూరంలో ఉన్న యువ వికెట్ కీపర్..
Panth
Follow us on

భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును సమం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటి వరకు 25 టెస్ట్‎లు అడిన పంత్ల గ్లౌవ్స్‎తో 97 వికెట్లు తీశాడు.(క్యాచ్, స్టంప్స్) ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో అతనికి ఆడే అవకాశం లభిస్తే, అతను టెస్టుల్లో అత్యంత వేగంగా 100 ఔట్లు నమోదు చేసిన ఆరో భారత కీపర్‌గా నిలుస్తాడు. ధోనీ 36 టెస్టుల్లోనే 100 అవుట్లు చేశాడు.

37 టెస్టుల్లో ఈ ఘనత సాధించిన వృద్ధిమాన్ సాహా ధోనీకి దగ్గరగా ఉన్నాడు. భారత మాజీ కీపర్లు కిరణ్ మోర్, నయన్ మోంగియా, సయ్యద్ కిర్మాణి వరుసగా 39, 41, 42 టెస్టుల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‎లో పంత్‌కు సెలెక్టర్లు విశ్రాంతి కల్పించారు.

భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల్లో మొదటి మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో ప్రారంభం కానుంది. రెండో టెస్టు జనవరి 3 నుంచి జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరగనుంది. మూడో మరియు చివరి టెస్ట్ మ్యాచ్ జనవరి 11 నుండి కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో ప్రారంభమవుతుంది.

Read Also.. Year Ender 2021: ఒలింపిక్స్‌ నుంచి టీ20 ప్రపంచకప్‌ వరకు.. ప్రపంచ క్రీడల్లో కీలక ఘట్టాలు..!