IND vs SA: నేడు భారత్, దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్.. తుది జట్టులో చోటు దక్కేది ఎవరికో..

|

Dec 26, 2021 | 7:23 AM

ఆదివారం నుంచి భారత్, దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. సూపర్‌స్పోర్ట్‌ పార్క్‌లో ‘బాక్సింగ్‌ డే’ టెస్టు జరగనుంది....

IND vs SA: నేడు భారత్, దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్.. తుది జట్టులో చోటు దక్కేది ఎవరికో..
India
Follow us on

ఆదివారం నుంచి భారత్, దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. సూపర్‌స్పోర్ట్‌ పార్క్‌లో ‘బాక్సింగ్‌ డే’ టెస్టు జరగనుంది. తొలి టెస్ట్‎లో గెలిచి సిరీస్ అధిక్యం సాధించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. భారత తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో ఉత్కంఠగా ఎదురు చేస్తున్నారు. మరోవైపు సొంతగడ్డపై భారత్‌ను ఓడించాలని సఫారీ జట్టు భావిస్తోంది.

అయితే ఈ మ్యాచ్‎లో భారత్ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగే అవకాశముంది. ఈ విషయాన్ని వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దీనిపై హింట్ ఇచ్చారు. ఐదురు బౌలర్లతో ఆడితే బాగుంటుందన్నారు. సూపర్‌స్పోర్ట్‌ పార్క్‌ పిచ్
దృష్ట్యా ఈసారి ఇండియాని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పేస్‌ బౌలర్లకే పెద్దపీట వేసే అవకాశం ఉంది. నలుగురు ఫాస్ట్ బౌలర్లు శార్దుల్‌ ఠాకూర్, షమీ, బుమ్రా, సిరాజ్‌లతో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఓపెనర్లుగా కేఎల్‌ రాహుల్, మయాంక్‌ అగర్వాల్‌ వచ్చే అవకాశం ఉంది. స్పిన్నర్‎గా అశ్విన్ బరిలోకి దిగనుంది.

మిడిలార్డర్‌లో కోహ్లీ వచ్చే అవకాశం ఉండగా.. పుజారా, రహానె, శ్రేయస్ అయ్యర్‎లో ఇద్దరికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. వికెట్ కీపర్‎గా పంత్ అవకాశం ఇస్తారా లేక సాహాను కొనసాగిస్తారా ఉత్కంఠ నెలకొంది. తెలుగు ఆటగాడు, టెస్టు స్పెషలిస్టు హనుమ విహారికి కూడా తుది జట్టులో అంతంత మాత్రంగానే అవకాశాలున్నాయి. తుది జట్టుపై కూర్పపై మీడియా సమావేశంలో కోచ్ రాహుల్ ద్రవిడ్‎ను ప్రశ్నించగా మ్యాచ్‎కు ముందే తుది జట్టును ప్రకటిస్తామని చెప్పారు.

Read Also.. Pro Kabaddi: ఉత్కంఠ పోరులో తెలుగు టైటాన్స్ ఓటమి.. చివర్లో ఏం జరిగిందంటే..