AUS vs SA: వన్డే ఫార్మాట్‌లో అరుదైన రికార్డ్.. 400కుపైగా స్కోర్‌తో చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..

South Africa vs Australia, Heinrich Klaasen: దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 416 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా జట్టు కేవలం 34.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 164 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తలో 2 విజయాలతో సమయంగా నిలిచాయి. ఇక 5వ వన్డే ఆదివారం జరగనుంది.

AUS vs SA: వన్డే ఫార్మాట్‌లో అరుదైన రికార్డ్.. 400కుపైగా స్కోర్‌తో చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..
Sa Vs Aus Records

Updated on: Sep 16, 2023 | 6:40 AM

AUS vs SA Record: 5 వన్డేల సిరీస్‌లో నాలుగో మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 416 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా జట్టు కేవలం 34.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 164 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తలో 2 విజయాలతో సమయంగా నిలిచాయి. ఇక 5వ వన్డే ఆదివారం జరగనుంది. సౌతాఫ్రికా తరపున వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుత సెంచరీ చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ 83 బంతుల్లో 174 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 13 సిక్సర్లు బాదాడు. అదే సమయంలో దక్షిణాఫ్రికా జట్టు తన పేరిట ఒక పెద్ద రికార్డును సృష్టించింది.

దక్షిణాఫ్రికా పేరిట భారీ రికార్డ్..

వన్డే ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికా 7వ సారి 400 పరుగుల మార్క్‌ను దాటింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధికంగా నిలిచింది. వన్డే చరిత్రలో దక్షిణాఫ్రికా మినహా మరే ఇతర జట్టు కూడా 400 పరుగుల స్కోరును 7 సార్లు అందుకోలేకపోయింది. కాగా, ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ గురించి మాట్లాడితే, ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ అద్భుత ఇన్నింగ్స్…

తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు శుభారంభం లభించింది. దక్షిణాఫ్రికా ఓపెనర్లు క్వింటన్ డి కాక్, రెజా హెన్రిక్స్ తొలి వికెట్‌కు 12.5 ఓవర్లలో 64 పరుగులు జోడించారు. క్వింటన్ డి కాక్ 64 బంతుల్లో 45 పరుగులు చేశాడు. రెజా హెన్రిక్స్ 34 బంతుల్లో 28 పరుగులు చేశాడు. వాన్ డర్ డస్సెన్ 65 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అయితే దీని తర్వాత హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ మధ్య ఐదో వికెట్‌కు 222 పరుగుల రికార్డు భాగస్వామ్యం ఏర్పడింది. చివరి బంతికి హెన్రిచ్ క్లాసెన్ అవుటయ్యాడు. కాగా, డేవిడ్ మిల్లర్ 45 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగాడు.

సౌతాఫ్రికా రికార్డ్ స్కోర్..

ఇరు జట్లు:

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్(సి), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, లుంగీ న్గిడి.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్(సి), మార్నస్ లాబుస్‌చాగ్నే, అలెక్స్ కారీ(w), మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మైఖేల్ నేజర్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..