Keshav Maharaj, India vs South Africa T20 Series: దేశవ్యాప్తంగా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజులపాటు ఈ ఉత్సవం జరగనుంది. ఈ 9 రోజులు అమ్మవారిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. ఈ సమయంలో ఆలయాలను దర్శించుకునేందుకు భక్తుల రద్దీ పెరుగుతుంది. ఇదిలా ఉంటే నవరాత్రుల మొదటి రోజున దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ప్లేయర్ కూడా భారత్‌లోని ఓ ప్రముఖ ఆలయాన్ని సందర్శించారు. సౌతాఫ్రికా జట్టు స్టార్ ఆల్ రౌండర్ కేశవ్ మహారాజ్ హిందూ దేవుళ్లపై ఎప్పుడూ ప్రత్యేక విశ్వాసంతో ఉంటాడు.
ధోతి ధరించి ఆలయానికి..
భారత్‌తో మూడు మ్యాచ్‌ల టీ20, ఆపై వన్డే సిరీస్ ఆడేందుకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టు సభ్యుడు కేశవ్ తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో ప్రార్థనలు చేశాడు. ఈ స్పెషల్ మూమెంట్‌కి సంబంధించిన ఫోటోను కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేశాడు. కేశవ్ మహారాజ్ ధోతీ ధరించి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేస్తున్న ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. క్యాప్షన్‌లో నవరాత్రుల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై మాతా ది అని కూడా అందించాడు.
ఫిబ్రవరి 7, 1990న డర్బన్‌లో జన్మించిన కేశవ్ మహారాజ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. పేసర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన కేశవ్ మహారాజ్ పూర్వీకులు ఒకప్పుడు భారతదేశంలో నివసించారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ నుంచి 1874లో దక్షిణాఫ్రికాకు తీసుకువచ్చారు. కేశవ్ కుటుంబంలో నలుగురు సభ్యులున్నారు. క్రికెటర్‌తో పాటు, అతనికి తల్లిదండ్రులు, సోదరి ఉన్నారు. అతను శ్రీలంకకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు.
తండ్రి, తాత కూడా క్రికెట్ ఆటలోనే..
కేశవ్ మహారాజ్ తండ్రి ఆత్మానంద్ కూడా ఒక క్రికెటర్. అతను దక్షిణాఫ్రికా తరపున దేశీయ క్రికెట్ ఆడాడు. అయితే ఆత్మానంద్‌కు టెస్టు క్రికెట్ ఆడే అవకాశం రాలేదు. తాత కూడా క్రికెటర్. కేశవ్ మహారాజ్ హనుమాన్‌కు గొప్ప భక్తుడు. దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నప్పటికీ, ఆచారాలను అనుసరిస్తారు. భారతీయు పండుగలు చేసుకుంటుంటారు.
అక్టోబర్ 28న తొలి మ్యాచ్..
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో అక్టోబర్ 28న తొలి మ్యాచ్ జరగనుంది. మెన్ ఇన్ బ్లూస్ మ్యాచ్‌కు ఒక రోజు ముందు సోమవారం ఒక రోజు సెలవు దొరికింది. రోహిత్ శర్మ బృందం విమానాశ్రయం నుంచి స్టేడియంకు చేరుకోగానే అభిమానులతో కిక్కిరిసిపోయింది. T20 ప్రపంచ కప్ జట్టు నుంచి తొలగించిన తర్వాత, చాలా మంది స్థానిక హీరో అయిన సంజు శాంసన్ పేరును ప్రస్తావిస్తున్నారు.
షెడ్యూల్..
భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 28న తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. దీంతో ఇరు జట్లకు మూడు రోజుల విరామం లభించింది. రెండో టీ20 అక్టోబరు 2న గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో, మూడో మ్యాచ్ అక్టోబర్ 4న ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. మూడు మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి.
దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం భారత జట్టు-
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (కీపర్), రవి అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమేష్ యాదవ్ హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.
భారత్‌తో సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు..
టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిక్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, జన్మాన్ మలన్, ఐదాన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, ఎన్రిక్ నోర్ట్జే, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, తబ్సోరిజ్ రైస్‌బాసి.