Cricket: బరిలోకి దిగితే తుఫాన్ బ్యాటింగ్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. 49 ఏళ్ల వయసులో హీటెక్కించే ఫొటోతో ఎంగేజ్‌మెంట్..

South Africa: క్రికెట్ ప్రపంచంలో కేవలం కొంతమంది బ్యాట్స్‌మెన్స్ మాత్రమే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టగలిగారు. అంతర్జాతీయ క్రికెట్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన హెర్షెల్ గిబ్స్ తొలిసారిగా ఈ ఘనత సాధించాడు. గిబ్స్ తన తుఫాన్ బ్యాటింగ్‌తో సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే.

Cricket: బరిలోకి దిగితే తుఫాన్ బ్యాటింగ్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. 49 ఏళ్ల వయసులో హీటెక్కించే ఫొటోతో ఎంగేజ్‌మెంట్..
Herschelle Gibbs

Updated on: Jul 18, 2023 | 1:00 PM

Herschelle Gibbs: క్రికెట్ ప్రపంచంలో కేవలం కొంతమంది బ్యాట్స్‌మెన్స్ మాత్రమే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టగలిగారు. అంతర్జాతీయ క్రికెట్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన హెర్షెల్ గిబ్స్ తొలిసారిగా ఈ ఘనత సాధించాడు. గిబ్స్ తన తుఫాన్ బ్యాటింగ్‌తో సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, 49 ఏళ్ల వయస్సులో ఈ ఆటగాడు హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. ఈ కారణం తెలిస్తే అభిమానులు కచ్చితంగా అవాక్కవుతారు.

49 సంవత్సరాల వయస్సులో నిశ్చితార్థం..

హెర్షెల్ గిబ్స్ 49 ఏళ్ల వయసులో తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. గత నెలలో గిబ్స్ తన సన్నిహితురాలు డానా నెమెత్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ జంట నిశ్చితార్థానికి సంబంధించిన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గిబ్స్-నెమెత్‌లు రొమాంటిక్ ప్రపోజల్‌తో సోషల్ మీడియాను హీటెక్కించారు. ఈ ఫొటోస్‌లో ఈ జోడీ లిప్ లాక్‌లతో రెచ్చిపోయారు.

ఇవి కూడా చదవండి

గిబ్స్‌కి ఇంతకు ముందే పెళ్లి..

గిబ్స్ ఇంతకు ముందు 2007లో వివాహం చేసుకున్నాడు. అతను సెయింట్ కిట్స్ ద్వీపంలో టెనిలి పోవైని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇద్దరూ త్వరలోనే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత గిబ్స్ అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు. అతను మద్యం సేవించడం నుంచి ఫిక్సింగ్ వరకు ప్రతిదానికీ వార్తల్లో నిలిచేవాడు.

రిటైర్మెంట్ తర్వాత కోచ్ అవతారం..

గిబ్స్ రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు కోచ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అతను అనేక టీ20 లీగ్ జట్లకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్‌కు కోచ్‌గా ఉన్నాడు. 2019లో యూరో టీ20 స్లామ్‌లో రోటర్‌డామ్ రైనోస్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. అదే సమయంలో లంక ప్రీమియర్ లీగ్‌లో కొలంబో కింగ్స్‌కు ప్రధాన కోచ్‌గా కూడా పనిచేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..