Sourav Ganguly: లెజెండ్స్‌ క్రికెట్‌ లీగ్‌లో గంగూలీ ఆడనున్నాడా? రూమర్లపై బీసీసీఐ ప్రెసిడెంట్ ఏమన్నాడంటే?

|

Jul 21, 2022 | 12:33 PM

Legends League Cricket: టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ఆధ్వర్యంలో లెజెండ్స్‌ క్రికెట్‌ లీగ్‌ ( LLC) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జరిగిన మొదటి ఎడిషన్‌ మ్యాచ్‌ల్లో వీరేంద్ర సెహ్వాగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, షేన్ వాట్సన్, ఇయాన్ మోర్గాన్, యూసుఫ్ పఠాన్..

Sourav Ganguly: లెజెండ్స్‌ క్రికెట్‌ లీగ్‌లో గంగూలీ ఆడనున్నాడా? రూమర్లపై బీసీసీఐ ప్రెసిడెంట్ ఏమన్నాడంటే?
Sourav Ganguly
Follow us on

Legends League Cricket: టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ఆధ్వర్యంలో లెజెండ్స్‌ క్రికెట్‌ లీగ్‌ ( LLC) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జరిగిన మొదటి ఎడిషన్‌ మ్యాచ్‌ల్లో వీరేంద్ర సెహ్వాగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, షేన్ వాట్సన్, ఇయాన్ మోర్గాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, ముత్తయ్య మురళీధరన్ తదితర దిగ్గజ క్రికెటర్‌లు ఆడి సందడి చేశారు. ఇక రెండో ఎడిషన్‌ మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 10వ తేదీ వరకు జరగనున్నాయి. ఒమన్‌ వేదికగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ టోర్నమెంట్ రవిశాస్త్రి ఇప్పటికే ప్రకటించారు. రెండో సీజన్‌లో కూడా పలువురు మాజీ ఆటగాళ్లు సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly) కూడా ఈ క్రికెట్‌ లీగ్‌లో ఆడనున్నట్లు వార్తలు వచ్చాయి. గంగూలీ కూడా లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ రెండో సీజన్‌లో ఆడతాడని నిర్వాహకులు గతంలో ప్రకటించినట్లు, ఇతర లెజెండ్స్‌తో ఆడటం సరదాగా ఉంటుందని సౌరవ్‌ చెప్పినట్లు సోషల్‌ మీడియాలో పోస్టులు చక్కర్లు కొట్టాయి.

అయితే ఈ విషయం గంగూలీ దాకా చేంది. దీంతో బీసీసీఐ ప్రెసిడెంట్‌ స్పందించక తప్పలేదు. లెజెండ్స్ లీగ్‌తో తాను భాగం కావడం లేదని, అవన్నీ రూమర్సేనని కొట్టి పారేశాడు.’నేను ఎల్‌ఎల్‌సీలో భాగం కావడం లేదు. అలాంటి వార్తలన్నీ అవాస్తవాలు’ అని గంగూలీ స్పష్టం చేశాడు. కాగా మొదటి సీజన్‌లో ఆడిన ఆటగాళ్లతో పాటు పాక్‌, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ దేశాలకు చెందిన మరికొందరు మాజీ ఆటగాళ్లు ఈ లీగ్‌లో ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశారు. వారిలో ఆసీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌, బ్రెట్‌లీ, స్టువర్ట్‌ బిన్నీ, మిచెల్‌ జాన్సన్‌, మోర్తాజా తదితరులు ఉన్నారు.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..