Rohit vs Dhoni vs Kohli: రోహిత్ శర్మను బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ సమర్థించారు. భారత మాజీ కెప్టెన్ మాట్లాడుతూ- ‘రోహిత్ శర్మను ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీతో పోల్చే ముందు మనం అతనికి సమయం ఇవ్వాలి. అప్పుడే సరైన ఫలితాన్ని ఇవ్వగలడు’ అంటూ చెప్పుకొచ్చాడు. 50 ఏళ్ల భారత మాజీ క్రికెటర్ రోహిత్ శర్మను ఎంతో ఓపికగల కెప్టెన్‌గా అభివర్ణించాడు. ముంబై ఇండియన్స్ తరపున రికార్డు స్థాయిలో 5 ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రోహిత్.. తిరుగులేని ఆధిపత్యంతో ఆకట్టుకున్నాడు. 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ ఇండియా ఏడుగురు కెప్టెన్లను మార్చిన సంగతి తెలిసిందే.
ధోనీ, కోహ్లీ, శర్మలలో ఎవరు బెటర్ కెప్టెన్?
‘ధోనీ, కోహ్లి, శర్మలలో బెటర్ కెప్టెన్ ఎవరు’ అనే ప్రశ్నకు గంగూలీ స్పందిస్తూ.. భారత్ కొన్నేళ్లుగా గొప్ప కెప్టెన్లను తయారు చేసిందని అన్నాడు. అందరూ భిన్నంగా ఉంటారు. కానీ, ఫలితం, ఎన్ని విజయాలు, ఓటములు ఉన్నాయి అనేది ముఖ్యం. నేను కెప్టెన్‌లను పోల్చను. ప్రతి ఒక్కరికి వారి స్వంత మార్గం ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా వారిపై తన అభిప్రాయలను పంచుకున్నాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఎంఎస్ ధోని: జట్టును అద్భుతంగా తీర్చిదిద్దాడు. భారతదేశానికి మాత్రమే కాకుండా అతని ఫ్రాంచైజీకి (చెన్నై సూపర్ కింగ్స్) కూడా తిరుగులేని విజయాలను అందించాడు.
విరాట్ కోహ్లీ: విరాట్ రికార్డు కూడా గొప్పదే. అతను విభిన్నమైన కెప్టెన్, రన్ మెషీన్‌గా జట్టును మందుండి నడిపించాడు.
రోహిత్ శర్మ: కొంచెం ప్రశాంతంగా, చాలా దూకుడుగా కాకుండా ఓపికతోపాటు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ, జట్టును నడిపిస్తున్నాడు అంటూ పేర్కొన్నాడు.
వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిపై గంగూలీ మాట్లాడుతూ – 2003లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో ముందుగా బౌలింగ్ చేయాలనే నిర్ణయంపై నేను వెనక్కి తిరిగి చూడను. నేను ఫైనల్‌లో ఓడిపోయానని నిరాశ చెందాను. అయితే ఫైనల్‌లో ఓడిపోవడానికి టాస్ కారణమని నేను అనుకోను. మేం బాగా ఆడలేదు’ అంటూ తేల్చేశాడు.