Sourav Ganguly: కోహ్లీ రిటైర్ అవ్వాలన్న పాక్ దిగ్గజ బౌలర్‌.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన దాదా.. ఏమన్నాడంటే..?

|

Aug 19, 2023 | 3:36 PM

Sourav Ganguly: పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలపై సౌరవ్ గంగూలీ దిమ్మతిరిగేలా స్పందించాడు. శుక్రవారం రెవ్‌స్పోర్ట్జ్స్‌తో మాట్టాడిన షోయబ్ అక్తర్ అంతర్జాతీయ క్రికెట్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లీ గురించి మాట్లాడుతూ..  ‘కోహ్లీ తనపై భారాన్ని తగ్గించుకోవడానికి వైట్ బాల్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలి, వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ వన్డే క్రికెట్ ఆడకపోవడమే మంచిది. టీ20 క్రికెట్‌తో కూడా అతని శక్తి చాలా ఖర్చవుతోంది. కోహ్లీ కనీసం మరో 6 సంవత్సరాలు క్రికెట్ ఆడితేనే సచిన్ పేరిట ఉన్న 100 సెంచరీలు రికార్డును బద్దలు..

Sourav Ganguly: కోహ్లీ రిటైర్ అవ్వాలన్న పాక్ దిగ్గజ బౌలర్‌.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన దాదా.. ఏమన్నాడంటే..?
Sourav Ganguly And Virat Kohli
Follow us on

భారత మాజీ కెప్టెన్, క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ వైట్ బాల్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని, అప్పుడే సచిన్ 100 సెంచరీల రికార్డ్‌ను అతను బ్రేక్ చేయగలడని పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలపై సౌరవ్ గంగూలీ దిమ్మతిరిగేలా స్పందించాడు. శుక్రవారం రెవ్‌స్పోర్ట్జ్స్‌తో మాట్టాడిన షోయబ్ అక్తర్ అంతర్జాతీయ క్రికెట్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లీ గురించి మాట్లాడుతూ..  ‘కోహ్లీ తనపై భారాన్ని తగ్గించుకోవడానికి వైట్ బాల్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలి, వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ వన్డే క్రికెట్ ఆడకపోవడమే మంచిది. టీ20 క్రికెట్‌తో కూడా అతని శక్తి చాలా ఖర్చవుతోంది. కోహ్లీ కనీసం మరో 6 సంవత్సరాలు క్రికెట్ ఆడితేనే సచిన్ పేరిట ఉన్న 100 సెంచరీలు రికార్డును బద్దలు కొట్టగలడు. సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేసే సత్తా కోహ్లీలో ఉంది. ఇలా జరగాలంటే కోహ్లీ వరల్డ్ కప్ తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడడంపైనే దృష్టి పెట్టాలి’ అని అక్తర్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీపై అక్తర్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాడు. ఈ క్రమంలోనే అక్తర్ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు.

అక్తర్ వ్యాఖ్యలను అంగీకరించని దాదా ‘విరాట్ కోహ్లీ క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌ ఆడాలనుకున్నా ఆడతాడు. ఎందుకంటే అతను ఆడగలడు’ అని అన్నాడు. ఈ క్రమంలోనే దాదా ఇటీవల వెస్టీండీస్ చేతుల్లో టీ20 సిరీస్ కోల్పోయిన జట్టుకు ఓ సలహా ఇచ్చాడు. ‘జట్టులోని అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకోండి. లెఫ్ట్ హ్యాండర్ లేదా రైట్ హ్యాండర్ అయినా పర్లేదు, భారత్‌లో అత్యుత్తమ లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. వారికి జట్టులో స్థానం లభిస్తుంది. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా. ఇది ఒక అద్భుతమైన జట్టు. భారతదేశం ప్రతి ఆట తర్వాత ఎదుగుతూ వచ్చిన దేశం. టీమ్ గెలిస్తే బెస్ట్, ఓడిపోతే వేస్ట్.. ఇదే ఆట తీరు’ అని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

15 ఏళ్లల్లో రికార్డులు.. 

‘కెప్టెన్’ కోహ్లీ రికార్డులు. 

అప్పుడు.. ఇప్పుడు.. 

15 సంవత్సరాలు.. 501 మ్యాచ్‌లు..

లెక్క కొనసాగుతోంది.. 

కాగా, శుక్రవారం అంటే ఆగస్టు 18 నాటికి కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ ఎన్నో రికార్డ్‌లను కొల్లగొట్టాడు. ముఖ్యంగా సచిన్ లాంటి ప్లేయర్ తన 500 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 75 సెంచరీలే చేస్తే.. కోహ్లీ అవే మ్యాచ్‌ల్లో 76 సెంచరీలు చేశాడు. ప్రత్యర్థి ఎవరైనా పరుగుల వర్షం కురిపిస్తూ ఉంటాడు. ఈ కారణంగానే అనుకుంటా కోహ్లీని.. చేజ్ మాస్టర్, కింగ్ కోహ్లీ, రన్ మెషిన్ అని చెబుతుంటారు మాజీలు, క్రికెట్ అభిమానులు.