Smriti Mandhana : తండ్రికి గుండెపోటు.. పెళ్లి వాయిదా.. ఆ బాధలో స్మృతి మంధాన షాకింగ్ డెసిషన్!

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన పెళ్లి అనుకోని విధంగా వాయిదా పడింది. ఆదివారం (నవంబర్ 23) మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం జరగాల్సి ఉంది. కానీ అదే రోజు ఉదయం కుటుంబంలో చోటుచేసుకున్న విషాదకర సంఘటన కారణంగా పెళ్లిని వాయిదా వేశారు.

Smriti Mandhana : తండ్రికి గుండెపోటు.. పెళ్లి వాయిదా.. ఆ బాధలో స్మృతి మంధాన షాకింగ్ డెసిషన్!
Smriti Mandhana (3)

Updated on: Nov 24, 2025 | 10:30 AM

Smriti Mandhana : భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన పెళ్లి అనుకోని విధంగా వాయిదా పడింది. ఆదివారం (నవంబర్ 23) మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం జరగాల్సి ఉంది. కానీ అదే రోజు ఉదయం కుటుంబంలో చోటుచేసుకున్న విషాదకర సంఘటన కారణంగా పెళ్లిని వాయిదా వేశారు. ఆదివారం ఉదయం అల్పాహారం తీసుకుంటున్న సమయంలో స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానకు అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. పరిస్థితి విషమించడంతో వెంటనే సాంగ్లీలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్ల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది.

తండ్రికి అస్వస్థత కలగడంతో స్మృతి మంధాన ఒక భావోద్వేగపూరితమైన కఠిన నిర్ణయం తీసుకున్నారు. స్మృతి మేనేజర్ తుహిన్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. తండ్రి శ్రీనివాస్ మంధాన పూర్తిగా కోలుకునే వరకు పెళ్లి చేసుకోకూడదని స్మృతి స్వయంగా నిర్ణయించుకున్నారు. అందుకే పెళ్లిని వాయిదా వేశారు.. అంతేకాకుండా, స్మృతి తన సోషల్ మీడియాలో కూడా ఈ బాధను పంచుకున్నారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఎంగేజ్‌మెంట్ వీడియోతో సహా, పెళ్లికి సంబంధించిన పోస్టులు అన్నింటినీ తొలగించారు. స్మృతి మంధాన తీసుకున్న ఈ అకస్మాత్తు నిర్ణయం ఆమె అభిమానులను కూడా ఆశ్చర్యపరిచింది.

స్మృతి మంధాన ఇంతకుముందు లగే రహో మున్నా భాయ్ సినిమాలోని సమజ్లో హో హి గయా అనే పాటకు డ్యాన్స్ చేస్తూ చేసిన ఒక సరదా ఇన్‌స్టాగ్రామ్ రీల్ ద్వారా పలాష్ ముచ్చల్‌తో తన ఎంగేజ్మెంట్ వార్తను ప్రకటించారు. ఆ వీడియోలో ఆమెతో పాటు జెమిమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి కూడా కనిపించారు. కానీ ఆ ప్రత్యేకమైన ఎంగేజ్‌మెంట్ పోస్ట్ ప్రస్తుతం స్మృతి మంధాన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కనిపించడం లేదు. ఆమె వాటిని పూర్తిగా డిలీట్ చేశారా లేదా హైడ్ చేశారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

మరోవైపు పలాష్ ముచ్చల్ మాత్రం తన సోషల్ మీడియా పోస్ట్‌ను అలాగే ఉంచారు. వివాహానికి కొద్ది రోజుల ముందు, పలాష్ ముచ్చల్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో స్మృతి మంధానకు ప్రత్యేకంగా ప్రపోజ్ చేశాడు. ఈ అద్భుతమైన క్షణానికి సంబంధించిన వీడియోను పలాష్ ముచ్చల్ నవంబర్ 21న తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. తండ్రి ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..