Video: స్మృతి మంధాన పెళ్లిపై కొత్త ట్విస్ట్.. వైరల్ వీడియోతో మారిన సీన్.. మళ్లీ ఒక్కటవుతున్నారా..?

Smriti Mandhana - Palash Muchhal: నవంబర్ 2025లో వైభవంగా జరగాల్సిన స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వివాహం అనుకోని కారణాల వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వైరలవుతోన్న వీడియో చూస్తే మాత్రం అంతా షాక్ అవ్వా్ల్సిందే. ఎందుకంటే, ఈ వీడియో ఇరు కుటుంబాలు కలిసి ఉండడం, ఆప్యాయంగా మాట్లాడుకోవడం చూస్తే గొడవలు సద్దుమణిగాయని, త్వరలో గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Video: స్మృతి మంధాన పెళ్లిపై కొత్త ట్విస్ట్.. వైరల్ వీడియోతో మారిన సీన్.. మళ్లీ ఒక్కటవుతున్నారా..?
Smriti Mandhana Palash Muchhal

Updated on: Apr 08, 2026 | 8:55 PM

Smriti Mandhana – Palash Muchhal: భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహంపై మళ్ళీ చర్చ మొదలైంది. గతంలో పెళ్లి ఆగిపోవడంతో విడిపోయారనుకున్న ఈ జంట గురించి తాజాగా ఒక ఆసక్తికర వీడియో వెలుగులోకి వచ్చింది. రెండు కుటుంబాలు కలిసున్న ఈ దృశ్యాలు చూస్తుంటే వారి మధ్య విభేదాలు తొలగిపోయాయా అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.

ఆగిపోయిన వివాహం.. వెనుక ఉన్న కారణాలు..

నిజానికి స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వివాహం గత ఏడాది నవంబర్ (2025)లో వైభవంగా జరగాల్సింది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక, సరిగ్గా పెళ్లికి ఒకరోజు ముందు స్మృతి తండ్రి శ్రీనివాస మంధాన ఆరోగ్యం క్షీణించడంతో వేడుకను వాయిదా వేశారు. అయితే ఆ తర్వాత పలాష్ మరొక అమ్మాయితో సన్నిహితంగా ఉంటూ దొరికిపోయారని, అందుకే స్మృతి ఈ పెళ్లిని రద్దు చేసుకుందనే వార్తలు నెట్టింట విపరీతంగా హల్చల్ చేశాయి. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి కనిపించకపోవడంతో బంధం తెగిపోయిందని అందరూ భావించారు.

వైరల్ వీడియోలో ఏం ఉంది?

తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ఒక వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోలో పలాష్ సోదరి, ప్రముఖ గాయని పాలక్ ముచ్చల్, ఆమె భర్త మిథున్.. స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస మంధానతో కలిసి ఉన్నారు. పాలక్ ముచ్చల్ ఎంతో గౌరవంగా స్మృతి తండ్రి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామంతో రెండు కుటుంబాల మధ్య మళ్ళీ సయోధ్య కుదిరిందని, త్వరలోనే శుభవార్త వింటామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

పాత వీడియోనా లేక నిజంగానే కలిశారా?

ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్నప్పటికీ, దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. కొంతమంది ఇది పెళ్లి నిశ్చయమైన కొత్తలో తీసుకున్న పాత వీడియో అని వాదిస్తుంటే, మరికొందరు మాత్రం ఇప్పుడిప్పుడే వివాదాలు సర్దుమణిగి మళ్ళీ ఒక్కటవుతున్నారని భావిస్తున్నారు. స్మృతి మంధాన గానీ, పలాష్ కుటుంబం గానీ ఈ విషయంపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. 2019 నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట మళ్ళీ కలుస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే మారింది.

మైదానంలో పరుగుల వరద పారించే స్మృతి మంధాన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. తాజా వీడియో పాతదా లేక కొత్తదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఇది సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్‌గా నిలిచింది. ఒకవేళ ఇరు కుటుంబాలు మళ్ళీ కలిస్తే గనుక త్వరలోనే ఈ స్టార్ క్రికెటర్ పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us