Bangladesh Bizarre DRS Video: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మధ్య 2-టెస్టుల సిరీస్‌లో రెండవ, చివరి మ్యాచ్ శనివారం ఛటోగ్రామ్‌లో ప్రారంభమైంది. ఈ టెస్టులో శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తోంది. మ్యాచ్ తొలి రోజునే బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో విచిత్రమైన డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అభిమానులు సోషల్ మీడియాలో ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా వీడియో చూస్తే వీడెవడండీ బాబూ అనుకుంటారు.
శ్రీలంక ఇన్నింగ్స్ 44వ ఓవర్ వేయడానికి తైజుల్ ఇస్లాం వచ్చాడు. తన ఓవర్ ఐదో బంతికి కుశాల్ మెండిస్ ముందుకు వచ్చి ఫార్వర్డ్ డిఫెన్స్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో బాల్ అతని బ్యాట్ మధ్యలో బంతి తగిలింది. బంతి బ్యాట్‌కి తగిలిన శబ్దం కూడా వినిపించింది. బంగ్లాదేశ్ ఆటగాడు ఎవరూ అప్పీల్ చేయలేదు. కానీ, స్లిప్‌లో నిలబడిన కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్.. బంతి ముందుగా ప్యాడ్‌కు తగిలి బ్యాట్‌కు తగిలిందని భావించి హడావుడిగా రివ్యూ తీసుకున్నాడు. ఆ తర్వాత, ఆన్-ఫీల్డ్ అంపైర్ రాడ్ టక్కర్ రివ్యూ కోసం థర్డ్ అంపైర్‌కు సంకేతాలు ఇచ్చాడు.
What just happened? 👀
.
.#BANvSL #FanCode #CricketTwitter pic.twitter.com/sJBR5jMSov— FanCode (@FanCode) March 30, 2024
పెద్ద స్క్రీన్‌పై రీప్లే చూపించిన సమయంలో బంతి బ్యాట్ మధ్యలో తగలడం, ప్యాడ్‌లకు చాలా దూరం కనిపించడంతో అందరూ పగలబడి నవ్వారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ కెప్టెన్‌కు ఇబ్బంది ఎదురవుతోంది. అనవసరంగా కెప్టెన్ రివ్యూ కోల్పోయాడని నవ్వుకుంటున్నారు. చాలా మంది వినియోగదారులు దీనిని చెత్త DRS అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
రెండు టెస్టుల సిరీస్‌లో శ్రీలంక ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టులో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుని, రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. నిషాన్ ముధాష్క (57), దిముత్ కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (93) పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు. బంగ్లాదేశ్ తరపున హసన్ మహమూద్ 2 వికెట్లు తీశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..