BAN VS ZIM 1st T20:మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 188 పరుగులకే ఆలౌటైంది. దీంతో సిరీస్‌లో జింబాబ్వే 1-0 ఆధిక్యంలో నిలిచింది. కాగా జింబాబ్వే విజయంలో సికందర్ రజా (Sikandar Raza) కీలక పాత్ర పోషించాడు. క్రీజులోకి రాగానే బౌలర్లపై విరుచుకుపడిన ఈ స్టార్ బ్యాటర్ 250 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ బంగ్లా పులులను బెంబేలెత్తించాడు. 36 ఏళ్ల సికందర్ 26 బంతుల్లో 65 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 4 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి. కాగా పొట్టి ఫార్మాట్లో అదరగొడుతోన్న రజా టీ20 క్రికెట్‌లోని చివరి 8 ఇన్నింగ్స్‌ల్లో, ఇది నాలుగో 40 ప్లస్ స్కోరు. మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సికందర్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. సికందర్‌తో పాటు వెస్లీ మదెవెరె (46 బంతుల్లో 67) రాణించారు. సీన్ విలియమ్స్ (19 బంతుల్లో 33) చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బంగ్లా గట్టిగానే పోరాడింది. కెప్టెన్ నరుల్ హసన్ (26 బంతుల్లో 42 నాటౌట్), లిటన్ దాస్ (19 బంతుల్లో 32) జట్టును గెలిచేందుకు చివరివరకు ప్రయత్నించారు. అయితే ఇతర ఆటగాళ్లు విఫలమవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులకే పరిమితమైంది. దీంతో 17 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
A 23-ball fifty for Sikandar Raza helps Zimbabwe post a good total in Harare! ?
Watch #ZIMvBAN series LIVE on https://t.co/CPDKNxoJ9v (in select regions) ?
?Scorecard: https://t.co/MqdoAejYAk pic.twitter.com/TrczPST86d
— ICC (@ICC) July 30, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..