
Manchester Test : మాంచెస్టర్‌లో జరిగిన భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని నాల్గవ టెస్ట్ డ్రాగా ముగిసినప్పటికీ, దాని ఫలితం మాత్రం భారత జట్టుకు పూర్తిగా అనుకూలంగా మారింది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ల చారిత్రాత్మక భాగస్వామ్యం, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ ఇంగ్లాండ్ జట్టు వ్యూహాలను తలకిందులు చేశాయి. ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ భారత క్రికెట్ పోరాట పటిమకు ప్రతీకగా నిలిచింది.
నాలుగో రోజు ఆట ప్రారంభంలో భారత్ 0 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు, ఇంగ్లాండ్ విజయం ఖాయమని భావించారు. కానీ, మొదట శుభ్‌మన్ గిల్ 103 పరుగులు, కేఎల్ రాహుల్ 90 పరుగులు చేసి మూడో వికెట్‌కు 188 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును మెరుగైన స్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత రవీంద్ర జడేజా నాటౌట్ 107 పరుగులు, వాషింగ్టన్ సుందర్ నాటౌట్ 101 పరుగులు చేసి స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు ఐదో వికెట్‌కు 303 బంతుల్లో 203 పరుగుల చారిత్రాత్మక భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను ఓటమి నుంచి కాపాడటమే కాకుండా, ఇంగ్లాండ్‌ను పూర్తిగా అలసిపోయేలా చేశారు.
ఐదవ రోజు ఇంగ్లాండ్ గెలుపు అవకాశాలు తగ్గిపోతుండటంతో కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒక ఎత్తుగడ వేశాడు. మ్యాచ్‌ను త్వరగా ముగించడానికి ప్రయత్నించాడు. స్టోక్స్ రవీంద్ర జడేజాతో షేక్ హ్యాండ్ ఇచ్చి మ్యాచ్‌ను డ్రాగా ముగించడానికి ప్రయత్నించాడు. అయితే, జడేజా అతనికి ధీటైన జవాబిస్తూ, ఈ నిర్ణయం తన చేతుల్లో లేదని ఆట కొనసాగిస్తానని చెప్పాడు. ఈ సమయంలో కెమెరా భారత డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళినప్పుడు, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పెద్దగా నవ్వుతూ కనిపించాడు. అతని నవ్వు జట్టు స్థితినే కాకుండా ఇంగ్లీష్ శిబిరంలోని నిరాశపై ఒక గట్టి వ్యంగ్యాస్త్రంలా మారింది. గిల్ ఈ రియాక్షన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
The game was done, but the drama wasn’t 🤯 #SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/zErsvC4XkA
— Sony Sports Network (@SonySportsNetwk) July 27, 2025
ఈ సిరీస్‌లోని నాలుగో టెస్ట్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లు ఒక కొత్త చరిత్ర సృష్టించారు. టెస్ట్ క్రికెట్ 91 ఏళ్ల చరిత్రలో ఒకే సిరీస్‌లో నలుగురు భారత బ్యాట్స్‌మెన్‌లు 400 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే మొదటిసారి.
శుభ్‌మన్ గిల్ – 722 పరుగులు
కేఎల్ రాహుల్ – 511 పరుగులు
రిషబ్ పంత్ – 479 పరుగులు
రవీంద్ర జడేజా – 454 పరుగులు
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..