Asia Cup 2023: రికార్డ్‌ సృష్టించిన శుభమాన్ గిల్.. అయ్యర్‌, కోహ్లీని అధిగమించి ఆ లిస్ట్‌లో టాప్ బ్యాటర్‌గా..

|

Sep 05, 2023 | 10:56 AM

Shubman Gill: ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 230 పరుగులు చేసినప్పటికీ.. మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో భారత్‌కి 23 ఓవర్లకు 144 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. టార్గెట్‌ని చేధించేందుకు రంగంలోకి రోహిత్ శర్మ 77, శుభమాన్ గిల్(67) హాఫ్ సెంచరీలో చెలరేగడంతో టీమిండియా విజయం సాధించింది. అలాగే సూపర్ 4కు క్వాలిఫై అయింది. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్‌లో 67 పరుగులు చేసిన శుభమాన్ ఓ అద్భుతమైన రికార్డును సృష్టించాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా..

Asia Cup 2023: రికార్డ్‌ సృష్టించిన శుభమాన్ గిల్.. అయ్యర్‌, కోహ్లీని అధిగమించి ఆ లిస్ట్‌లో టాప్ బ్యాటర్‌గా..
Shubman Gill
Follow us on

IND vs NEP: ఆసియా కప్‌ 2023 టోర్నీలో భాగంగా భారత్, నేపాల్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 230 పరుగులు చేసినప్పటికీ.. మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో భారత్‌కి 23 ఓవర్లకు 144 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. టార్గెట్‌ని చేధించేందుకు రంగంలోకి రోహిత్ శర్మ 77, శుభమాన్ గిల్(67) హాఫ్ సెంచరీలో చెలరేగడంతో టీమిండియా విజయం సాధించింది. అలాగే సూపర్ 4కు క్వాలిఫై అయింది. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్‌లో 67 పరుగులు చేసిన శుభమాన్ ఓ అద్భుతమైన రికార్డును సృష్టించాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా 1500 వన్డే పరుగులు చేసుకున్న ఆటగాడిగా శుభమాన్ అవతరించాడు. శుభమాన్ ఇప్పటి వరకు 4 సెంచరీలు, ఓ డబుల్ సెంచరీతో మొత్తం 1514 పరుగులు చేశాడు.

అయితే శుభమాన్ కంటే ముందు ఈ రికార్డ్ శ్రేయాస్ అయ్యర్ పేరిట ఉండేది. అయ్యర్ 34 ఇన్నింగ్స్‌ల్లో 1500 పరుగులు పూర్తి చేసుకోగా.. అతని కంటే వేగంగా శుభమాన్ 29 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ మార్క్‌ని చేరుకున్నాడు. దీంతో భారత్ తరఫున అత్యంత వేగంగా 1500 వన్డే పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా గిల్ ప్రథమ స్థానంలో ఉండగా.. అయ్యర్ ఇప్పుడు రెండో స్థానానికి దిగాడు. ఇక అయ్యర్ తర్వాత కేఎల్ రాహుల్(36 ఇన్నిగ్స్) మూడో స్థానంలో.. విరాట్ కోహ్లీ(38), శిఖర్ ధావన్(38) నాలుగో స్థానంలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఓపెనర్లతోనే పని పూర్తి..

జడ్డూ భాయ్..

అజేయమైన అర్థ సెంచరీలు..

కాగా, ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా భారత్ ఆసియా కప్ సూపర్ 4 రౌండ్‌కు అర్హత సాధించింది. గ్రూప్ ఎ నుంచి భారత్ కంటే ముందే పాక్ చేరుకోగా.. ఈ ఇరు జట్లు సెప్టెంబర్ 10న సూపర్ 4 మూడో మ్యాచ్‌లో తలపడనున్నాయి.

సూపర్ 4.. పాక్‌తో మళ్లీ పోరు..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..