
భారత టెస్ట్ జట్టుకు శుభ్‌మాన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించడం పట్ల భారీ చర్చ సాగుతున్న తరుణంలో, బీసీసీఐ చివరకు ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను బయటపెట్టింది. ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ముంబైలో మే 24న బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టు ఎంపికను ప్రకటించాడు. ఈ సమయంలో గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం వెనుక ఉన్న వ్యూహాన్ని ఆయన వివరించారు. శుభ్‌మాన్ గిల్‌కు టెస్ట్ ఫార్మాట్‌లో నాయకత్వ అనుభవం లేకపోయినప్పటికీ, గతంలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. అలాగే ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కూడా కెప్టెన్‌గా ఉన్నాడు. వన్డేలు మరియు టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా సేవలందిస్తూ, ఇప్పటికే తన నాయకత్వ లక్షణాలను చాటిచెప్పాడు.
అయితే ఎంపికైన జట్టులో జస్‌ప్రీత్ బుమ్రా, కెఎల్ రాహుల్ లాంటి నాయకత్వ అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నప్పటికీ, గిల్‌నే కెప్టెన్‌గా ఎంచుకోవడంపై అనేకమంది సందేహాలు వ్యక్తం చేశారు. దీనిపై బీసీసీఐ మౌనం వీడి, స్పష్టత ఇచ్చింది. అజిత్ అగార్కర్ మాట్లాడుతూ, “బుమ్రా ఆస్ట్రేలియాలో మాకు నాయకత్వం వహించాడు. కానీ అతను ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడంటే గ్యారంటీ లేదు. అతనిని ముఖ్యమైన బౌలర్‌గా భావిస్తున్నాం. శరీర తత్వం దృష్టిలో ఉంచుకుంటే, అతన్ని పూర్తి ఫిట్‌నెస్‌తో బౌలింగ్ చేసే స్థితిలో ఉంచడం మాకు ముఖ్యం. కెప్టెన్సీ అనేది 15-16 మంది ఆటగాళ్లను నిర్వహించాల్సిన అదనపు భారం, అది ఆటగాడిగా అతనిపై ప్రభావం చూపుతుంది” అని తెలిపారు.
కేఎల్ రాహుల్ విషయంలో కూడా, గతంలో అతను కెప్టెన్‌గా వ్యవహరించినా, ప్రస్తుతం అతను పెద్ద సిరీస్‌కు సిద్ధమవుతుండగా, తాజా జట్టులో నాయకత్వ బాధ్యతల కోసం ఎంపిక కాలేదు. దీర్ఘకాలిక ప్రణాళికలే తమకు ముఖ్యం అని చెప్పిన అగార్కర్, “ఒకటి లేదా రెండు సిరీస్‌లకే కెప్టెన్‌ను ఎంచుకునే పరిస్థితిలో మేము లేము. మేము ముందే దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించుకుని, గిల్‌కు ఈ బాధ్యత అప్పగించాము. కాలక్రమేణా అతను నేర్చుకుంటాడని ఆశిస్తున్నాము” అన్నారు.
గిల్‌కి టెస్ట్ కెప్టెన్సీలో అనుభవం లేకపోయినప్పటికీ, వయస్సు 25 సంవత్సరాలే అయినప్పటికీ, అతనిపై బీసీసీఐ ఉన్న నమ్మకాన్ని ఇది స్పష్టంగా చూపిస్తుంది. టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు ఆడి, ఐదు సెంచరీలతో కలిపి 1,893 పరుగులు చేసిన గిల్, భారత రెడ్-బాల్ క్రికెట్‌కు భవిష్యత్తులో ఒక కీలక నేతగా ఎదగనున్నాడు. ఈ నిర్ణయం ద్వారా భారత క్రికెట్‌లో కొత్త శకం ప్రారంభమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, బుమ్రా, రాహుల్‌లను పక్కనపెట్టి, అనుభవం లేని గిల్‌కు నాయకత్వాన్ని అప్పగించడం సమంజసం అనే దానిపై అభిమానుల్లో మిశ్రమ స్పందనలు కొనసాగుతూనే ఉన్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..