
శ్రేయాస్ అయ్యర్.. ఒక్కప్పుడు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి పక్కనపెట్టడమే కాదు.. జట్టులో ఛాన్స్‌లు ఇవ్వకుండా తన్ని తరిమేసింది. స్థాయికి తగ్గట్టు ప్రదర్శన కనబరిచినా చిన్న చూపు చూసిన బీసీసీఐకి కౌంటర్ ఎటాక్ ఇచ్చాడు శ్రేయాస్ అయ్యర్. అరిచిన నోళ్లను తన బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. వన్డేల్లో నెంబర్ 4గా తన స్టామినా ఏంటో ఛాంపియన్స్ ట్రోఫీలో నిరూపించుకోవడమే కాదు.. బీసీసీఐతో మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్ అందుకోబోతున్నాడు.
సెంట్రల్ వార్షిక కాంట్రాక్ట్‌లలో నుంచి బీసీసీఐ శ్రేయాస్ అయ్యర్ పేరును అర్ధాంతరంగా తీసేసింది. అతనిపై క్రమశిక్షణా రాహిత్య చర్యలు తీసుకుంది. దేశవాళీ క్రికెట్ ఆడకుండా బీసీసీఐ నియమాలను ఉల్లంఘించాడంటూ.. ఆ సమయంలో బీసీసీఐ ఆరోపణలు చేసింది. దీంతో శ్రేయాస్ అయ్యర్ కథ అయిపోయిందని అందరూ ఊహించారు. కానీ కంబ్యాక్ అంతకంటే స్ట్రాంగ్‌గా ఇచ్చాడు శ్రేయాస్.
జాతీయ మీడియాలో వచ్చిన ఓ కథనం ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను పునరుద్ధరించాలని బీసీసీఐ నిర్ణయించింది. కొత్త కాంట్రాక్టులలో ఆటగాళ్ల గ్రేడ్.. మూడు ఫార్మాట్లలో వారి ప్రదర్శన ఆధారంగా ఉండబోతోందట. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలకు చెందిన గ్రేడ్ ఏ ప్లస్‌ను కూడా బీసీసీఐ పున: పరిశీలించనుంది బీసీసీఐ.
కొత్త వార్షిక కాంట్రాక్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా స్థానాలు మారే అవకాశం కనిపిస్తోంది. గ్రేడ్-ఏ ప్లస్ కేవలం మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్లకు ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యారు. టెస్ట్ సీజన్‌లో వీరి ప్రదర్శన అంత బాగా లేదు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ దక్కితే, ఈ ముగ్గురు సేఫ్ అని టాక్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి