Shreyas Iyer: ఖరీదైన లగ్జరీ కారు కొన్న టీమిండియా క్రికెటర్.. ఫొటోస్ వైరల్ ధర ఎంతో తెలుసా?

ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు టీమిండియా యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్. ప్రస్తుతం క్రికెట్ కు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటోన్న ఈ క్రికెటర్ మెర్సిడెస్ జి-వ్యాగన్ కారును కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కారు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Shreyas Iyer: ఖరీదైన లగ్జరీ కారు కొన్న టీమిండియా క్రికెటర్.. ఫొటోస్ వైరల్ ధర ఎంతో తెలుసా?
Shreyas Iyer

Updated on: Jul 03, 2025 | 6:30 AM

 

 

ఇవి కూడా చదవండి

టీం ఇండియా యంగ్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం హాలీడే మూడ్ లో ఉంటున్నాడు. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటించిన భారత టెస్ట్ జట్టులోఅతనికి చోటు దక్కలేదు. అందుకే, తన కుటుంబంతో సమయం గడుపుతున్న శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడు ఖరీదైన కారు కొన్నాడు. దానితో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. అయ్యర్ మెర్సిడెస్ జి-వాగన్ అనే కారును కొనుగోలు చేశాడు. దీని విలువ రూ.3 కోట్లకు పైగానే ఉందని తెలుస్తోంది. శ్రేయాస్ అయ్యర్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేశారు, అందులో అతను తన కారులో పోజులిస్తూ కనిపించాడు. ఈ ఫోటోలో అయ్యర్ బ్లాక్ కలర్ బటీ-షర్ట్, అదే కలర్‌ ప్యాంటు, బూట్లు ధరించి స్టైలిష్ గా దర్శనమిచ్చాడు. ఈ ఫోటోలను షేర్ చేయడంతో పాటు ‘ గోయింగ్ టు ప్లేసెస్’ అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో పంజాబ్ కింగ్స్ జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో పంజాబ్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. కానీ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి పాలైంది. ఈ మొత్తం టోర్నమెంట్‌లో, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ, బ్యాటింగ్ రెండింటిలోనూ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. అతను 17 మ్యాచ్‌ల్లో 50.33 సగటు మరియు 175.07 స్ట్రైక్ రేట్‌తో 604 పరుగులు చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కు శ్రేయస్ అయ్యర్ ఎంపిక కాలేదు.
ఇటీవల, శ్రేయాస్ అయ్యర్ కూడా సెలవుల కోసం కజకిస్తాన్‌కు వెళ్లాడు. అక్కడ అతని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం, తన సెలవులను గడపడంతో పాటు, శ్రేయాస్ అయ్యర్ భారత జట్టులోకి తిరిగి రావడానికి కృషి చేస్తున్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ టీమ్ ఇండియా తరపున తన చివరి వన్డే ఆడాడు.

కొత్త కారుతో శ్రేయస్ అయ్యర్ పోజులు..

 

టీమిండియా కెప్టెన్  రోహిత్ శర్మ చేతుల మీదుగా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..