Shreyas Iyer Unlikely: గబ్బర్ అభిమానులకు గుడ్ న్యూస్.. శ్రీలంక టూర్‌ నుంచి శ్రేయాస్ అయ్యర్ ఔట్..

|

May 12, 2021 | 5:39 PM

Shreyas Iyer unlikely: శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ నుంచి భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ తప్పుకున్నాడు. లంక పర్యటన కోసం జట్టుని ప్రకటించేందుకు బీసీసీఐ సెలెక్టర్లు సిద్ధమవుతుండగా.. శ్రేయాస్ సెలక్షన్‌కి...

Shreyas Iyer Unlikely: గబ్బర్ అభిమానులకు గుడ్ న్యూస్.. శ్రీలంక టూర్‌ నుంచి శ్రేయాస్ అయ్యర్ ఔట్..
India Tour Of Sri Lanka
Follow us on

శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ నుంచి భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ తప్పుకున్నాడు. లంక పర్యటన కోసం జట్టుని ప్రకటించేందుకు బీసీసీఐ సెలెక్టర్లు సిద్ధమవుతుండగా.. శ్రేయాస్ సెలక్షన్‌కి ఈ సమాచారం అందింది. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌, ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జంబో జట్టు ఈ నెలాఖరులో ఇంగ్లండ్ టూర్‌ కోసం వెళ్లనుండగా.. మరోవైపు గతేడాది వాయిదా పడిన శ్రీలంక పర్యటనను బీసీసీఐ ఇప్పుడు ఏర్పాట్లు చేస్తోంది. శ్రీలంక టూర్‌లో భారత్ 3వన్డేలు, 3 టీ20లు ఆడనుంది.

శ్రేయాస్ ఔట్..

అయితే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2021 ముందు ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో శ్రేయస్‌ అయ్యర్ భుజానికి తీవ్ర గాయమైంది. మార్చి 26న ఇంగ్లండ్‌తో జరిగిన  మొదటి వన్డేలో బౌండరీని ఆపే క్రమంలో అయ్యర్ ఎడమ భుజానికి తీవ్ర గాయం అయ్యింది. దీంతో జట్టుకు దూరమయ్యాడు. ఏప్రిల్‌ 8న అయ్యర్‌ భుజానికి సర్జరీ జరిగింది. సర్జరీ తర్వాత  అయ్యర్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం 120 నుంచి 150 రోజులు పట్టే అవకాశం ఉందని డాక్టర్లు ఇప్పటికే వెల్లడించారు. దీంతో లంక పర్యటన వరకు అతడు పూర్తిస్థాయిలో కోలుకునే అవకాశం కనిపించడం లేదు.

ధావన్‌కి లైన్ క్లియర్

అయితే శ్రీలంక టూర్ కోసం బీసీసీఐ ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ముందుగా జట్టు హెడ్ కోచ్ ఎంపికపై దృష్టి పెట్టింది. ఆ తర్వాత జట్టు సారథి ఎవరుంటారు..? అనే అంశంపై చర్చ మొదలు పెట్టింది. ఇందులో ముందుగా శ్రేయాస్ అయ్యర్‌పై ఫోకస్ పెట్టిది. అయ్యర్ శ్రీలంక టూర్ వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేక పోవడంతో … శ్రీలంకలో భారత జట్టును నడిపించేదెవరన్నది పెద్ద దిక్కుగా అయ్యర్‌ తర్వాత స్థానంలో గబ్బర్ సింగ్‌కు ఛాన్స్ లభించే అవకాశం ఉంది.

కెప్టెన్ పోటీలో ఉన్న సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కి లైన్ క్లియర్ అయింది. ఇక దాదాపు టీమిండియాకు గబ్బర్ కెప్టెన్ అయినట్టే. అదే నిజమయితే ధావన్ మొదటిసారి జట్టుకు సారథ్యం వహించే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి: Lockdown: తెలంగాణలో మొదలైన లాక్‌డౌన్… నిర్మల్ జిల్లాలో ఎలా ఉందో తెలుసుకున్న మంత్రి

Telangana Lockdown: ఈ-పాస్ ఉంటేనే రవాణాకు అనుమతి.. ఎలా తీసుకోవాలో తెలుసా..? వివరాలు..