వాని వల్లే మ్యాచ్ దొబ్బింది.. వైభవ్‌ని ఆడించనది అందుకే..: శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్

Shreyas Iyer comments On IND vs NZ 4th T20I: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ 87 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమిపై శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ, బౌలింగ్ విభాగం వైఫల్యం ప్రధాన కారణమని పేర్కొన్నారు. గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్వెల్ అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించారని, వారి నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉందని అయ్యర్ అభిప్రాయపడ్డారు. చివరి మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ప్రణాళికలు మార్చుకుంటామని తెలిపారు.

వాని వల్లే మ్యాచ్ దొబ్బింది.. వైభవ్‌ని ఆడించనది అందుకే..: శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Ind Vs Nz 4th T20i Iyer Comments

Updated on: Oct 30, 2026 | 6:29 PM

Shreyas Iyer comments On IND vs NZ 4th T20I: న్యూజిలాండ్ పర్యటనలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న టీం ఇండియా విజయ పరంపరకు ఆక్లాండ్ వేదికగా శుక్రవారం నాడు జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో అడ్డుకట్ట పడింది. అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టిన కివిస్ జట్టు ఏకంగా 87 పరుగుల భారీ తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఈ ఓటమి భారత జట్టుకు ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. అంతేకాకుండా, టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత్‌పై న్యూజిలాండ్‌కి ఇది అతిపెద్ద విజయం కావడం గమనార్హం. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ 3-1తో తగ్గించుకొని తమ పరువును కాపాడుకుంది.

మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే, టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఆరంభంలోనే మయాంక్ యాదవ్ గట్టి షాక్ ఇచ్చినా, ఆ తర్వాత కివిస్ బ్యాటర్లు భారత బౌలింగ్‌ను పీకి పందిరేశారు. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 259 పరుగుల భారీ స్కోర్ సాధించారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 49 బంతుల్లో ఆరు ఫోర్లు, 10 సిక్సర్లతో 107 రన్స్ చేసి భారత బౌలర్లకు నరకం చూపించాడు. అతనికి తోడుగా బ్రేస్వెల్ హాఫ్ సెంచరీతో మరో లెవెల్ బ్యాటింగ్ ఆడాడు. 25 బంతుల్లోనే 65 పరుగులు బాది టీమిండియా ఓటమికి అతనే పెద్ద కారణంగా నిలిచాడు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్ స్పిన్నర్లు అందరూ కలిపి దారుణమైన పరుగులు ఇవ్వడం ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది.

ఈ భారీ ఓటమిపై భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించారు. ఈ సిరీస్ అంతా గ్లెన్ ఫిలిప్స్ నిలకడగా ఆడుతున్నాడని, అతన్ని చూసి తాము నేర్చుకోవాల్సింది చాలా ఉందని అయ్యర్ అన్నారు. ఈరోజు మ్యాచ్‌లో తాము బ్యాటింగ్‌లో కాదు, బౌలింగ్‌లోనే మెరుగ్గా రాణించలేకపోయామని ఆయన అంగీకరించారు. మూడో ఓవర్ నుంచే న్యూజిలాండ్ బ్యాటర్లకు మూమెంట్ లభించి తమపై ఆధిపత్యం చలాయించారని శ్రేయస్ అయ్యర్ వివరించారు. తమ బౌలర్లు వారిని కట్టడి చేయడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయిందని తెలిపారు. ఫిలిప్స్ అసాధారణ బ్యాటింగ్, అతనికి తోడు బ్రేస్వెల్ విధ్వంసం తమ ఓటమికి అసలు కారణమని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశారు.

జట్టు తప్పుల నుండి నేర్చుకుంటుందని అయ్యర్ హామీ ఇచ్చారు. “ఇక మా తప్పిదాలను సమీక్షించుకుంటాం. ఆఖరి టీ20 కి ఒకే ఒక్క రోజు సమయం ఉంది. కాబట్టి ప్రణాళికలను మార్చుకొని చివరి మ్యాచ్‌లో 100 శాతం గెలిచేందుకు ప్రయత్నిస్తాం” అంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే సిరీస్ గెలిచామని, అది సంతోషమేనని, చివరి మ్యాచ్‌ను కూడా విజయంతో ముగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తుది జట్టు కూర్పుపై కూడా శ్రేయస్ అయ్యర్ స్పందించారు. ఇషాన్ కిషన్ గాయం నుంచి కోలుకోవడంతోనే వైభవ్ ను పక్కన పెట్టాల్సి వచ్చిందని శ్రేయస్ అయ్యర్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు జట్టులో ఆటగాళ్ల లభ్యత ఆధారంగా తీసుకున్న నిర్ణయాలను సూచిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us