వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన మాలిక్

|

Jul 06, 2019 | 12:37 AM

లార్డ్స్: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కేవలం సీనియారిటీ అనే ట్యాగ్ లైన్‌తో ఇంతకాలం చోటు దక్కించుకున్న ఆటగాడు షోయబ్ మాలిక్. ఇంగ్లాండ్ గడ్డపై అతడి సీనియారిటీ జట్టుకు ఉపయోగపడుతుందని యాజమాన్యం అనుకుంటే అది కాస్తా రివర్స్ అయింది. ప్రపంచకప్ టోర్నీలో ఘోరంగా విఫలమై జట్టులోనే చోటు కోల్పోయాడు మాలిక్. దీంతో వన్డేలకు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం మాలిక్ తన రిటైర్మెంట్ అంశాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. కాగా మాలిక్ రిటైర్మెంట్ […]

వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన మాలిక్
Follow us on

లార్డ్స్: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కేవలం సీనియారిటీ అనే ట్యాగ్ లైన్‌తో ఇంతకాలం చోటు దక్కించుకున్న ఆటగాడు షోయబ్ మాలిక్. ఇంగ్లాండ్ గడ్డపై అతడి సీనియారిటీ జట్టుకు ఉపయోగపడుతుందని యాజమాన్యం అనుకుంటే అది కాస్తా రివర్స్ అయింది. ప్రపంచకప్ టోర్నీలో ఘోరంగా విఫలమై జట్టులోనే చోటు కోల్పోయాడు మాలిక్. దీంతో వన్డేలకు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం మాలిక్ తన రిటైర్మెంట్ అంశాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. కాగా మాలిక్ రిటైర్మెంట్ విషయంపై పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.