ఐపీల్-15(IPL-15) సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలవాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆకాంక్షించారు. ట్రోఫీ సాధించి క్రికెట్ దిగ్గజం, దివంగత షేన్ వార్న్ కు నివాళి అర్పించాలని కోరారు. అయితే అదే సమయంలో.. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ జట్టే విజేతగా నిలుస్తుందని అంచనా వేశాడు. ఐపీల్ టోర్నీ ప్రారంభమైన 2008 లో రాజస్థాన్ తొలిసారి విజేతగా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆ జట్టు ఫైనల్‌కు చేరింది. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ‘14 ఏళ్ల తర్వాత రాజస్థాన్ ఫైనల్ చేరింది. షేన్ వార్న్‌కు నివాళిగా ఆ జట్టు గెలవాలని బలంగా కోరుకుంటున్నా. ఇప్పటికే ఆ జట్టు ఎన్నో కష్టాలకోర్చి ఫైనల్ వరకు చేరింది. అయితే గుజరాత్ కూడా బాగా ఆడుతోంది.’ అని అక్తర్ అన్నారు. రాజస్థాన్ తొలి సీజన్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఫైనల్ చేరడంతో దూకుడుగా ఆడుతోందని, మరోవైపు.. గుజరాత్ కూడా తొలి సీజన్‌లో తమ మార్క్ చూపించాలని తాపత్రయపడుతోందని అక్తర్ వ్యాఖ్యానించారు.
ఐపీఎల్-2008లో రాజస్థాన్ రాయల్స్‌కు షేన్ వార్న్ సారథ్యం వహించారు. అరంగేట్రంలోనే జట్టుకు టైటిల్ అందించి చరిత్ర సృష్టించారు. అయితే, ఆ తర్వాత రాజస్థాన్ మళ్లీ ఫైనల్ చేరుకోవడానికి పద్నాలుగేళ్లు పట్టింది. ఐపీఎల్-2022 తో మెగా టోర్నీలో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ లో ఉన్న జట్ల కంటే ముందే ఫైనల్‌కు చేరింది.
మరికొద్ది గంటల్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మొదలు కానుంది. ఈ ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మొతేరా స్టేడియంలో రాత్రి 8 గంటలకు జరగనున్న ఫైనల్ మ్యా్చ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలడుతుండగా.. ఈ రెండింటిలో ఈసారి టైటిల్ కొట్టేదెవరు? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరిన్ని క్రీడలు వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి