Viral : ఏం బాబు బ్యాగు ఇస్తే స్కూలు వెళ్తావా..దూబే కొత్త హెయిర్‌స్టైల్ చూసి ఆడుకుంటున్న నెటిజన్స్

Viral : టీమిండియా స్టార్ ఆల్‎రౌండర్ శివమ్ దూబే ప్రస్తుతం సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‎గా మారాడు. అయితే అది అతను కొట్టిన సిక్సర్ల వల్ల కాదు. అతడి వెరైటీ హెయిర్‌స్టైల్ వల్ల. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆడుతున్న దూబే, తన కొత్త లుక్‌తో అభిమానులకు ముఖ్యంగా 90వ దశకంలో పుట్టిన వారికి తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేశాడు.

Viral : ఏం బాబు బ్యాగు ఇస్తే స్కూలు వెళ్తావా..దూబే కొత్త హెయిర్‌స్టైల్ చూసి ఆడుకుంటున్న నెటిజన్స్
Shivam Dube

Updated on: Jan 23, 2026 | 2:37 PM

Viral : శివమ్ దూబే సాధారణంగా తన ఫిట్‌నెస్, లాంగ్ సిక్సర్లతో ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. కానీ న్యూజిలాండ్‎తో జరిగిన మొదటి టీ20లో అతను ఒక కొత్త హెయిర్‌స్టైల్‌తో మైదానంలోకి దిగాడు. అది ఎలా ఉందంటే.. చిన్నప్పుడు అమ్మ మన తలకి నిండుగా నూనె రాసి, దువ్వెనతో నీట్‌గా పక్కకి దువ్వి స్కూల్‌కి పంపించే గుడ్ బాయ్ లుక్ లా ఉంది. ఈ లుక్ చూసిన వెంటనే నెటిజన్లు రకరకాల మీమ్స్‌తో సోషల్ మీడియాను నింపేశారు. ముఖ్యంగా 90వ దశకంలో పుట్టిన వారు.. “మా అమ్మ కూడా నన్ను ఇలాగే తయారు చేసేది” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఈ హెయిర్‌స్టైల్‌పై వెల్లువెత్తిన రియాక్షన్లు చూస్తే నవ్వు ఆగదు. ఒక నెటిజన్ తన ఫోటోను తారక్ మెహతా కా ఉల్టా చష్మా షోలోని బాగా క్యారెక్టర్‌తో పోల్చగా, మరికొందరు సచిన్ టెండూల్కర్ చిన్నప్పటి లుక్ పోలి ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇంకొకరు రెండు ఫోటోలను పోస్ట్ చేస్తూ.. “నేను రెడీ అయితే ఎలా ఉంటాను vs మా అమ్మ నన్ను రెడీ చేస్తే ఎలా ఉంటాను” అంటూ సెటైర్లు వేశారు. ఈ సరదా మీమ్స్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ వైరల్ ట్రెండ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా చేరింది. శివమ్ దూబే ప్రాక్టీస్ సెషన్‌లో ఉన్న ఒక వీడియోను షేర్ చేస్తూ.. “ప్రతి భారతీయ తల్లికి ఇష్టమైన హెయిర్‌స్టైల్” అని క్యాప్షన్ ఇచ్చింది. దీనికి టీమిండియా ఆటగాళ్లు అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్ కూడా దూబేను ఆటపట్టించారు. దీనిపై దూబే స్పందిస్తూ.. “దీనిని క్యూట్ హెయిర్‌స్టైల్ అంటారు” అంటూ నవ్వుతూ రిప్లై ఇచ్చారు. జట్టు సభ్యుల మధ్య ఉన్న ఈ సరదా వాతావరణం ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

ఇక ఆట విషయానికి వస్తే.. మొదటి టీ20లో దూబే ప్రదర్శన సోసోగా ఉంది. బ్యాటింగ్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచినప్పటికీ, బౌలింగ్‌లో మాత్రం సత్తా చాటాడు. కీలకమైన 2 వికెట్లు తీసి కివీస్ స్కోరును కట్టడి చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. హెయిర్‌స్టైల్ ఎలా ఉన్నా, తర్వాతి మ్యాచ్‌లో దూబే తన బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..