Shane Warne: టీమిండియ బ్యాటింగ్ ఆర్డర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన షేన్‌ వార్న్‌..

Shane Warne: భారత టెస్ట్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ప్రస్తుతం చాలా బలంగా ఉందన్నాడు ఆస్ట్రేలియా మాజీ లెగ్‌ స్పిన్నర్ షేన్ వార్న్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా,

Shane Warne: టీమిండియ బ్యాటింగ్ ఆర్డర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన షేన్‌ వార్న్‌..
Shane Warne
Follow us

|

Updated on: Sep 13, 2021 | 10:08 PM

Shane Warne: భారత టెస్ట్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ప్రస్తుతం చాలా బలంగా ఉందన్నాడు ఆస్ట్రేలియా మాజీ లెగ్‌ స్పిన్నర్ షేన్ వార్న్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే వంటి స్వచ్చమైన టెస్ట్‌ బ్యాట్స్‌మెన్లు ఉన్నారన్నారని కొనియాడాడు. కానీ ఇండియా పాత బ్యాటింగ్ ఆర్డర్‌కు ఇది దగ్గరగా లేదన్నాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, VVS లక్ష్మణ్ వంటి దిగ్గజాలు అప్పుడు ఉండేవారన్నాడు. ఈ ఐదుగురు బ్యాట్స్‌మన్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌలర్లను ఒత్తిడికి గురిచేసేవారని చెప్పాడు.

అయితే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. వార్న్ ని బాగా ఆకట్టుకున్నాడు. అతను విరాట్‌కు పెద్ద ఫ్యాన్‌ అయిపోయాడు. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే, పాత ‘ఫ్యాబ్ ఫైవ్’తో పోలిక లేదన్నాడు. ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్, సెహ్వాగ్, టెండూల్కర్‌లంత బలంగా లేదన్నాడు. ప్రస్తుత బ్యాటింగ్ ఆర్డర్‌ అత్యుత్తమ భారత బ్యాటింగ్ ఆర్డర్ అని తాను అనుకోవడం లేదని చెప్పాడు. గత కొన్ని సంవత్సరాలుగా భారత జట్టు అసాధారణంగా రాణిస్తోంది. ఆస్ట్రేలియాలో వరుసగా టెస్ట్ సిరీస్ గెలిచారు.

ఇంగ్లాండ్‌లో 2-1తో ముందంజలో ఉన్నారు. కోహ్లీ, రోహిత్, పంత్ జట్టులోని స్టార్ బ్యాట్స్‌మెన్ వార్న్ అన్నాడు. అయితే ఈ విజయాలన్ని కేవలం బౌలింగ్‌ ప్రతిభతో వచ్చాయని పేర్కొన్నాడు. అయితే ప్రస్తుత జట్టు చాలా బలమైనదని పొగిడాడు. ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. సిరీస్‌లో 2–1తో ముందంజలో ఉంది. సిరీస్‌ను నిర్ణయించే టెస్ట్ మ్యాచ్ శుక్రవారం మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ప్రారంభం కావాల్సి ఉండేది కానీ కరోనా కారణంగా రద్దు చేశారు. టీమ్ ఇండియాలో కరోనా కేసులు రావడంతో ఆటగాళ్లు మైదానంలో దిగడానికి నిరాకరించారు.

Korea Missile: అమెరికాకు కొరకరాని కొయ్యగా మారిన ఉత్తర కొరియా నియంత కిమ్.. మళ్లీ ఎం చేశాడో తెలుసా..?

Kidney Problems: కరోనాతో ఐసీయూలో చేరిన వారిలో కిడ్నీ సమస్యలు.. మూత్రపిండాల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం ఎలా?

CM KCR on Ganesh Immersion: గణేష్ నిమజ్జనంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష!