Shahid Afridi Sachin Tendulkar
Sachin Tendulkar – Shahid Afridi: క్రికెట్ మాజీ దిగ్గజం.. సచిన్ టెండూల్కర్ కరోనావైరస్ బారిన పడి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన కరోనా బారిన పడ్డారన్న విషయం తెలుసుకోని అభిమానులంతా ఆందోళనకు గురయ్యారు. క్రికెట్ లెజెండ్ సచిన్.. త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదిక ద్వారా ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా సచిన్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించాడు. మీరు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా… తొందరగా కోలుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో తక్కువ కాలంలోనే ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నా.. అంటూ షాహిద్ అఫ్రిది ట్వీట్ చేశాడు. కాగా.. అఫ్రిది కూడా గతేడాది జూన్‌లో కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.
తనకు కరోనా సోకినట్లు సచిన్ టెండూల్కర్ స్వయంగా మార్చి 27న ట్వీట్ చేసి వెల్లడించారు. మొదట హోం క్వారంటైన్‌లో ఉన్న సచిన్.. ఆ తర్వాత వైద్యుల సలహా మేరకు ఈ నెల 2న ఆసుప్రతిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా సచిన్ ట్విట్ చేశారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన, తన క్షేమం కోరిన వారందరికీ సచిన్ ధన్యవాదాలు తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఇంటికి తిరిగి వస్తానని ఆశిస్తున్నానన్నారు. అందరూ జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలంటూ సచిన్ విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా టీమిండియాకు, భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలాఉంటే.. ఇటీవల ముగిసిన ‘వరల్డ్ రోడ్ సేప్టీ సిరీస్’లో ఇండియా లెజెండ్స్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ జట్టులోని నలుగురు సభ్యులు.. సచిన్ టెండూల్కర్, యూసఫ్ పఠాన్, సుబ్రమణ్యం బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్ వరుసగా.. కరోనా బారిన పడ్డారు.
అఫ్రిది చేసిన ట్విట్..
Also Read: