India vs England 4th T20: థర్డ్ అంపైర్ నిర్ణయం మరోసారి వివాదంగా మారింది. ఇంగ్లండ్-టీమిండియా మధ్య జరుగుతున్న నాలుగో టీ20లో కోహ్లీసేన భారీ టార్గెట్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 186 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందుంచింది. అయితే లక్ష్య చేధనలో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 177 పరుగులే చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్ లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారింది.
ఇదే మ్యాచ్‌తో ఆరంగేట్రం చేసిన ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (57/ 31 బంతుల్లో 6-4, 3-6) సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో డేవిడ్ మలాన్‌కి క్యాచ్ ఇచ్చాడు. అయితే ఇదే క్యాచ్ కాస్తా వివాదంగా మారింది. డేవిడ్ మాలాన్ పట్టేందుకు ప్రయత్నించాడు. బంతిని పట్టుకుంటున్న సమయంలో అది కాస్త నేలకు తగిలింది.
అయితే రిప్లైలో బంతి నేలను తాకినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఫీల్డ్ అంపైర్ తీసుకున్న తప్పుడు నిర్ణయానికి సూర్య కుమార్ ఎంట్రీ మ్యాచ్‌లోనే బలి కావాల్సి వచ్చింది. అప్పటికే సూర్య కుమార్ చక్కని ఇన్నింగ్స్‌తో దూకుడుగా ఆడుతూన్నాడు.
స్యామ్ కరన్ వేసిన 14వ ఓవర్ తొలి బంతిని స్వీప్‌షాట్‌తో లెగ్‌సైడ్ సిక్సర్ బాదిన యాదవ్ తర్వాత బంతిని అలాగే ఆడాడు. కానీ ఫైన్‌లెగ్‌లో మలాన్ క్యాచ్ అందుకున్నాడు. అయితే బంతి అతని చేతుల్లో పడీపడగానే నేలనీ తాకింది. ఈ క్యాచ్‌ను ఒకటి రెండు సార్లు రీప్లే చేసి కొన్ని నిమిషాలపాటు చూసి ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన ‘సాఫ్ట్ సిగ్నల్ అవుట్’కే మొగ్గుచూపడంతో సూర్యకుమార్ క్రీజు వీడాడు. అంత స్పష్టంగా నేలను తాకినా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై టీమిండియా సారథి విరాట్ కోహ్లి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. థర్డ్ అంపైర్ తీసుకున్న ఔట్ కాస్తా ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
కళ్లకు గంతలు కట్టుకుని అంపైర్ నిర్ణయం ఇచ్చినట్టుగా సెహ్వాగ్ తన ట్వీట్ వేదికగా సెటైర్ వేశాడు.
Third umpire while making that decision. #INDvENGt20 #suryakumar pic.twitter.com/JJp2NldcI8
— Virender Sehwag (@virendersehwag) March 18, 2021
ఇక దీనిపై దినేశ్ కార్తిక్ కూడా స్పందిస్తూ ఫన్నీ ట్వీట్‌ను పోస్ట్ చేశాడు. బుల్లెట్‌పై సూర్య, విరాట్, రోహిత్ కలిసి థర్డ్ అంపైర్‌ని కొట్టేందుకు వెళ్తున్నట్టు ఉన్న మీమ్ ను పోస్ట్ చేశాడు. అంతేకాదు క్రికెట్‌లో అంపైర్ జాబ్ చాలా కష్టమని ఎలాగో భారత్ గెలిచింది కాబట్టి అతడిని కాస్త మందలించండి అని చెప్పుకొచ్చాడు.
Unlucky Suryakumar Yadav poor decision by umpire onfield and 3rd umpire Hard luck SKY
— Danish Kaneria (@DanishKaneria61) March 18, 2021
కెరీర్‌లో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకున్న సూర్యకుమార్ యాదవ్ 31 బంతుల్లో 57/ 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అద్భతమైన ఫామ్‌లో ఉన్నాడు.