BCCI: 13 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా రీఎంట్రీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్కసారి కూడా ఔట్ కాలే..

|

Jul 16, 2023 | 6:30 AM

Indian Cricket: 13 ఏళ్లుగా టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఆటగాడికి కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. ఈ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్కసారి కూడా ఔట్ కాలేదు.

BCCI: 13 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా రీఎంట్రీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్కసారి కూడా ఔట్ కాలే..
Saurabh Tiwary
Follow us on

Indian Cricket Team: జులై 24 నుంచి ఆగస్టు 3 వరకు పుదుచ్చేరిలో జరగనున్న దేవధర్ ట్రోఫీ-2023 ఇంటర్-జోనల్ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో జార్ఖండ్‌కు చెందిన సౌరభ్ తివారీ ఈస్ట్ జోన్‌కు నాయకత్వం వహించనున్నాడు. బెంగాల్ బ్యాట్స్‌మెన్ అభిమన్యు ఈశ్వరన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రియాన్ పరాగ్, షాబాజ్ అహ్మద్, ఆకాశ్ దీప్ వంటి ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. నాలుగేళ్ల విరామం తర్వాత దేవధర్ ట్రోఫీని నిర్వహిస్తున్నారు. ఈస్ట్ జోన్ జట్టు జులై 24న సెంట్రల్ జోన్‌తో తమ ప్రచారాన్ని ప్రారంభించనుంది.

అరంగేట్రం మ్యాచ్‌లో జట్టు విజయం సాధించడంలో హీరోగా నిలిచాడు..

సౌరభ్ తన వన్డే అరంగేట్రం అక్టోబర్ 20, 2010న ఆస్ట్రేలియాపై ఆడాడు. ఈ మ్యాచ్‌లో చాలా చిన్నదైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడిన సౌరభ్‌కి అరంగేట్రం మ్యాచ్‌ను చిరస్మరణీయం అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 3 వికెట్లకు 289 పరుగులు చేసింది. మైకేల్ క్లార్క్ 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సౌరభ్ 17 బంతుల్లో 12 నాటౌట్‌గా నిలిచాడు. అతను రెండు అద్భుతమైన ఫోర్లు కూడా కొట్టాడు. తివారీ బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో మ్యాచ్‌లో భారత్ స్థానం చాలా క్లిష్టమైనది. కానీ, సౌరభ్ నిరాశ చెందకుండా సురేశ్ రైనాతో కలిసి భారత్‌ను గెలిపించాడు.

13 ఏళ్లుగా టీమిండియాలో చోటు దక్కించుకోలేదు..

సౌరభ్ తివారీ ఇప్పటి వరకు టీమిండియా తరపున మొత్తం 3 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో అతడిని ఏ బౌలర్ కూడా అవుట్ చేయలేకపోయాడు. సౌరభ్ తివారీ 2010 నుంచి టీమింయాకు దూరంగా ఉన్నాడు. ఈ 3 వన్డేల్లో సౌరభ్ తివారీ 49 పరుగులు చేశాడు. అంతేకాదు ఐపీఎల్‌లో 93 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో అతను 1494 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

దేవధర్ ట్రోఫీకి ఈస్ట్ జోన్ జట్టు: సౌరభ్ తివారీ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ ఘరామి, సుభ్రాంశు సేనాపతి, రిషబ్ దాస్, ఉత్కర్ష్ సింగ్, కుమార్ కుషాగ్రా, అభిషేక్ పోరెల్, విరాట్ సింగ్, రియాన్ పరాగ్, షాబాజ్ అహ్మద్, అవినవ్ చౌదరి, మణిశంకర్ మురా సింగ్, ముక్తర్ హుస్సాన్, ముక్తార్ హుస్సాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..