Netravalkar: భారత్‌లో పుట్టాడు.. విదేశీ జట్టుకు మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు.. ఆ ప్లేయర్ ఎవరంటే!

|

Jul 15, 2022 | 11:04 AM

పుట్టింది ఇండియాలో.. ఆడుతున్నది విదేశీ జట్టు తరపున.. సీన్ కట్ చేస్తే.. ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లలో ఆ జట్టుకు మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు.

Netravalkar: భారత్‌లో పుట్టాడు.. విదేశీ జట్టుకు మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు.. ఆ ప్లేయర్ ఎవరంటే!
Sourabh Netvekkar
Follow us on

పుట్టింది ఇండియాలో.. ఆడుతున్నది విదేశీ జట్టు తరపున.. సీన్ కట్ చేస్తే.. ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లలో ఆ జట్టుకు మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. ఇంతకీ ఆ ప్లేయర్ మరెవరో కాదు యూఎస్ఏ ఆటగాడు సౌరబ్ నేత్రవల్కర్.

టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్స్‌లో భాగంగా అమెరికా, సింగపూర్ జట్ల మధ్య ఇటీవల ఓ మ్యాచ్ జరిగింది. ఇందులో యూఎస్ఏ 132 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సింగపూర్.. అమెరికాను బ్యాటింగ్‌కు దింపింది. యూఎస్ఏ బ్యాటర్లు స్టీవెన్ టేలర్(58), జస్కరన్ మల్హోత్రా(58) అర్ధ సెంచరీలతో ఆదరగొట్టడంతో.. నిర్ణీత 20 ఓవర్లకు ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

కొండంత లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన సింగపూర్ జట్టుకు సౌరభ్ నేత్రవల్కర్ చుక్కలు చూపించాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ పదునైన బంతులతో ప్రత్యర్ధి జట్టును ముప్పుతిప్పలు పెట్టాడు. అతని బౌలింగ్ దెబ్బకు ఆ జట్టులోని 8 మంది బ్యాట్స్‌మెన్‌లు రెండంకెల డిజిట్లను కూడా చేరుకోలేకపోయారు. సింగపూర్ జట్టులో అనంత కృష్ణ(21) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.

టీ20లో సౌరభ్ నేత్రవల్కర్ అత్యుత్తమ ప్రదర్శన..

15.2 ఓవర్లలో సింగపూర్ జట్టు 69 పరుగులకే ఆలౌటైంది. భారతీయ ఇంజనీర్, యూఎస్ఏ క్రికెటర్ సౌరభ్ నేత్రవల్కర్ సింగపూర్ జట్టు పతనంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్ల కోటాలో సౌరభ్ 12 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అండర్-19, దేశవాళీ క్రికెట్‌ను భారత్ తరపున ఆడిన సౌరభ్.. ప్రస్తుతం అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ అంతర్జాతీయ టీ20ల్లో తొలిసారిగా 5 వికెట్లు తీశాడు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..