IND vs AUS: 36 మ్యాచ్‌ల్లో 12 సెంచరీలు.. 9 అర్థ సెంచరీలు.. బౌలర్లపై ఊచకోత కోసినా.. భారత జట్టులో దక్కని చోటు..

Sarfaraz Khan: ముంబయి తరపున దేశవాళీ క్రికెట్‌లో మూడేళ్లుగా రాణిస్తున్న యువ బ్యాటర్‌కు.. మరోసారి కూడా భారత టెస్టు జట్టులో చోటు దక్కలేదు.

IND vs AUS: 36 మ్యాచ్‌ల్లో 12 సెంచరీలు.. 9 అర్థ సెంచరీలు.. బౌలర్లపై ఊచకోత కోసినా.. భారత జట్టులో దక్కని చోటు..
Sarfaraz Khan

Updated on: Jan 14, 2023 | 10:18 AM

India Squad for Australia Series: ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ (AUS vs IND) మధ్య ప్రారంభమయ్యే నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు టీమ్ ఇండియాను బీసీసీఐ ప్రకటించింది. ఇక్కడ అంచనాలకు తగ్గట్టుగానే జట్టు మొత్తాన్ని ఎంపిక చేసినా.. ముంబై బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్‌కు మాత్రం మరోసారి నిరాశ తప్పలేదు. దేశవాళీ క్రికెట్‌లో గత మూడు సీజన్‌లుగా నిలకడగా రాణిస్తున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతని బ్యాటింగ్ సగటు 80+గా నిలిచింది.

సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటివరకు 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 52 ఇన్నింగ్స్‌ల్లో 3380 పరుగులు చేశాడు. ఇక్కడ అతని బ్యాటింగ్ సగటు 80.47గా ఉంది. ఈ సమయంలో, అతను మొత్తం 12 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు చేశాడు. ఒకసారి ట్రిపుల్ సెంచరీ కూడా చేశాడు. గత మూడు సీజన్‌లుగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతని బ్యాట్‌ వర్షం కురిపిస్తోంది. ఈ బ్యాట్స్‌మెన్ 2019-20లో 155 సగటుతో 928 పరుగులు చేశాడు. ఆ తర్వాత 2021-22 సీజన్‌లో మరోసారి 123 సగటుతో 900 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. 2022-23 సీజన్‌లో కూడా అతను భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు.

ఈ 25 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్‌ అద్భుత ప్రదర్శన చూసి.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా అతడిని విస్మరించలేదు అని అంతా భావించారు. బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో సర్ఫరాజ్ ఖచ్చితంగా ఆడతాడని గతంలో కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ ఆటగాడు నిరాశను ఎదుర్కొంటున్నాడు.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియాతో భారత టెస్టు జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..