Sanju Samson : ఐపీఎల్‌లో సంజు శాంసన్ ఏప్రిల్ 11 సెంటిమెంట్.. రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం

Sanju Samson : సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం, అంటే 2017 ఏప్రిల్ 11న సంజు శాంసన్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో సభ్యుడు. ఆ రోజు రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు 63 బంతుల్లో 102 పరుగులు చేశాడు. సరిగ్గా ఏప్రిల్ 11 నే ఢిల్లీ క్యాపిటల్స్ పై సెంచరీ కొట్టాడు.

Sanju Samson : ఐపీఎల్‌లో సంజు శాంసన్ ఏప్రిల్ 11 సెంటిమెంట్.. రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
Sanju Samson

Updated on: Apr 12, 2026 | 7:52 AM

Sanju Samson : ఐపీఎల్ (IPL) చరిత్రలో కొన్ని యాధృచ్ఛికాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సంజు శాంసన్ విషయంలో అలాంటిదే ఒక వింత చోటుచేసుకుంది. సరిగ్గా ఏప్రిల్ 11 అనే తేదీ సంజు కెరీర్‌లో ఒక గోల్డెన్ డేగా మారిపోయింది. ఈ తేదీన సంజు శాంసన్ ఒక సెంచరీ ఢిల్లీ టీమ్ కోసం కొడితే.. మరొక సెంచరీ అదే ఢిల్లీ టీమ్ మీద కొట్టాడు. వినడానికి వింతగా ఉన్నా, అంకెలు చెబుతున్న నిజం ఇదే. ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడుతున్న సంజు శాంసన్, ఏప్రిల్ 11న ఢిల్లీ క్యాపిటల్స్‌పై విరుచుకుపడ్డాడు. కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇది ఐపీఎల్ 2026 సీజన్‌లో నమోదైన మొదటి సెంచరీ. ఈ అద్భుత ఇన్నింగ్స్ వల్ల చెన్నై ఈ సీజన్‌లో తన మొదటి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సెంచరీ వెనుక ఉన్న అసలు ట్విస్ట్ తొమ్మిదేళ్ల క్రితం జరిగింది.

2017 ఏప్రిల్ 11న ఢిల్లీ తరపున మెరుపులు

సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం, అంటే 2017 ఏప్రిల్ 11న సంజు శామ్సన్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్) జట్టులో సభ్యుడు. ఆ రోజు రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు 63 బంతుల్లో 102 పరుగులు చేశాడు. అది సంజు ఐపీఎల్ కెరీర్‌లో మొదటి సెంచరీ. విశేషమేమిటంటే, ఆ రోజు సంజు ఢిల్లీ కోసం ఆడుతూ ధోనీ జట్టుపై (పుణె) సెంచరీ కొట్టాడు. ఇప్పుడు అదే ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై టీమ్ కోసం ఆడుతూ ఢిల్లీ మీద సెంచరీ కొట్టాడు.

ధోనీతో ముడిపడిన చిత్రమైన కథ

ఈ రెండు సెంచరీల వెనుక ఎంఎస్ ధోనీకి సంబంధించిన ఒక వింతైన లింక్ ఉంది. 2017లో సంజు సెంచరీ కొట్టినప్పుడు అది ధోనీ ఉన్న పుణె టీమ్ మీద కొట్టాడు. అప్పుడు సిఎస్‌కె జట్టుపై నిషేధం ఉండటంతో ధోనీ పుణె తరపున ఆడాడు. ఇప్పుడు 2026లో సంజు సెంచరీ కొట్టింది ధోనీ టీమ్ (సిఎస్‌కె) లో ఉండి. ఈ రెండు సందర్భాల్లోనూ సంజు సెంచరీ కొట్టిన తేదీ ఏప్రిల్ 11 కావడం, ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ సంజు జట్టే విజయం సాధించడం, రెండింటిలోనూ అతనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కావడం ఒక అద్భుతమైన యాధృచ్ఛికం.

ఒకే స్క్రిప్ట్.. ఒకే రిజల్ట్

2017లోనూ ఏప్రిల్ 11నే ఆ సీజన్ మొదటి సెంచరీ నమోదైంది (సంజు ద్వారా). ఇప్పుడు 2026లోనూ ఏప్రిల్ 11నే సీజన్ మొదటి సెంచరీ నమోదైంది (మళ్ళీ సంజు ద్వారానే). రెండు మ్యాచ్‌ల్లోనూ సంజు టీమ్ మొదట బ్యాటింగ్ చేసింది, రెండుసార్లూ భారీ స్కోర్లు సాధించి విజయం అందుకుంది. పాయింట్ల పట్టికలో వెనుకబడిన చెన్నైకి ఈ సెంచరీ ఊపిరిపోస్తే, ఢిల్లీకి మాత్రం సంజు రూపంలో పాత జ్ఞాపకాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఐపీఎల్ చరిత్రలో ఒకే తేదీన, ఒకే టీమ్‌కు అనుకూలంగా, వ్యతిరేకగా సెంచరీ కొట్టిన ఏకైక ఆటగాడిగా సంజు నిలిచిపోయాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us