శాంసన్ vs శ్రేయస్.. ఇద్దరిలో టీ20 కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలి? సెలెక్టర్లు, గంభీర్, ఫ్యాన్స్.. ఎవరి ఓటు ఎటు?

భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ పేరు వినిపించడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. టీ20 ప్రపంచకప్‌లో రాణించిన సంజు శాంసన్‌ను పక్కన పెట్టడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ అధికారిక ప్రకటన కోసం క్రికెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

శాంసన్ vs శ్రేయస్.. ఇద్దరిలో టీ20 కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలి? సెలెక్టర్లు, గంభీర్, ఫ్యాన్స్.. ఎవరి ఓటు ఎటు?
Shreyas Iyer, Sanju Samson

Updated on: Jun 05, 2026 | 8:22 AM

భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్ ఎంపికపై చర్చలు ఊపందుకున్న వేళ, శ్రేయస్ అయ్యర్ పేరు బలంగా వినిపించడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అయ్యర్‌ను టీ20 కెప్టెన్‌గా నియమించే దిశగా బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో అభిమానుల మధ్య తీవ్ర చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించడంతో, కెప్టెన్సీ బాధ్యతలు అతనికే అప్పగిస్తారని చాలా మంది భావించారు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో కన్సిస్టెన్సీ, లీడర్‌షిప్ క్వాలిటీ అతడిని బలమైన అభ్యర్థిగా నిలబెట్టాయి. మాజీ కోచ్‌లు, విశ్లేషకులు కూడా శాంసన్ నాయకత్వ సామర్థ్యాన్ని ప్రశంసించారు.

అయితే సెలక్షన్ కమిటీ మాత్రం దీర్ఘకాలిక ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని శ్రేయస్ అయ్యర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అయ్యర్‌కు ఉన్న అనుభవం, ఒత్తిడిలో జట్టును నడిపించే సామర్థ్యం అతనికి అనుకూలంగా మారినట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంజు శాంసన్‌కు మద్దతు ఇచ్చినా, సెలెక్టర్లు అయ్యర్‌ను మెరుగైన దీర్ఘకాలిక ఎంపికగా భావించినట్లు పేర్కొన్నాయి.

ఈ పరిణామాలపై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు శాంసన్‌ను విస్మరించడం అన్యాయమని విమర్శిస్తుండగా, మరికొందరు అయ్యర్‌కు ఉన్న కెప్టెన్సీ అనుభవం దృష్ట్యా ఈ నిర్ణయం సరైనదేనని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రాంతీయ పక్షపాతం ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ వార్తలన్నీ ఊహాగానాలుగానే పరిగణించాల్సి ఉంటుందని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ముందు కెప్టెన్సీపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉండటంతో భారత జట్టు భవిష్యత్ నాయకత్వంపై ఆసక్తి మరింత పెరిగింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us