వామ్మో.. 16 ఏళ్లుగా నిరాశేనా.. టీ20 ప్రపంచకప్‌లో ఆ రికార్డ్ బ్రేక్ చేసే టీమిండియా ప్లేయర్ ఎవరు..?

T20I World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 కోసం రంగం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని జట్లు తమ పూర్తి స్వ్కాడ్స్‌తో రెడీగా ఉన్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానున్న ఈ మెగా టోర్నీలో డిపెండింగ్ ఛాంపియన్‌గా భారత జట్టు బరిలోకి దిగనుంది.

వామ్మో.. 16 ఏళ్లుగా నిరాశేనా.. టీ20 ప్రపంచకప్‌లో ఆ రికార్డ్ బ్రేక్ చేసే టీమిండియా ప్లేయర్ ఎవరు..?
Team India

Updated on: Jan 29, 2026 | 5:20 PM

T20I World Cup: 2026లో భారతదేశంతోపాటు శ్రీలంకలో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌నకు అంతా సిద్ధమైంది. ఈ క్రమంలో భారత జట్టు ఫిబ్రవరి 7న అమెరికాతో తన తొలి లీగ్ మ్యాచ్ ఆడనుంది. టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా, టోర్నమెంట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. సంజు శాంసన్ అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. అయితే, గత 16 సంవత్సరాలలో భారత జట్టు తరపున ఓ అద్భుతాన్ని ఫ్యాన్స్ మిస్సవుతున్నారు. మరి ఈసారి సంచలనానికి హీరోగా ఎవరు నిలవనున్నారో చూడాలి. ముఖ్యంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో అభిషేక్ శర్మతోపాటు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ పేర్లు వినిపిస్తున్నాయి. అసలు ఆ రికార్డు ఏంటి, 16 సంవత్సరాలుగా ఎందుకు సాధించలేకపోయారో ఓసారి చూద్దాం. ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్న ఆ రికార్డు ఏంటంటే.. టీ20 ప్రపంచకప్ లో టీమిండియా తరపున సెంచరీ నమోదు కావండం. కాగా, ఇప్పటి వరకు ఒకే ఒక్క టీమిండియా ప్లేయర్ సెంచరీ పూర్తి చేశాడు. సురేష్ రైనా 2010లో సౌతాఫ్రికాపై ఈ సెంచరీ చేశాడు. దీంతో సురేష్ రైనా టీ20 ప్రపంచకప్ హిస్టరీలో తొలి సెంచరీ చేసిన టీమిండియా ప్లేయర్ గా నిలిచాడు. మరి యువ రక్తంతో నిండిన సూర్యసేనలో ఆ ఘనత సాధించేది ఎవరు, 16 ఏళ్ల రికార్డ్ ను బద్దలు కొట్టేది ఎవరో ఓసారి చూద్దాం..

ఎవరు బాదేస్తారు..?

ఈ లిస్ట్ లో అభిషేక్ శర్మ ముందుగా గుర్తుకు వస్తాడు. కానీ అతనికంటే ముందు సంజూ శాంసన్ ఈ లిస్ట్ లో తొలి వ్యక్తిగా నమోదయ్యే ఛాన్స్ ఉందని అటు ఫ్యాన్స్ తోపాటు మాజీలు కూడా భావిస్తున్నారు. సంజూ శాంసన్ సెంచరీ తప్పకుండా బాదేస్తాడని చెప్పింది ఎవరో కాదు.. భారత జట్టు తరపున టీ20 ప్రపంచ కప్ లో తొలి సెంచరీ చేసిన సురేష్ రైనా చెప్పడం గమనార్హం. కాగా, శాంసన్ ఇటీవలి పేలవమైన ఫామ్‌ను కూడా ఆయన ఎత్తి చూపాడు. ఇది తాత్కాలిక దశ అంటూ చెప్పుకొచ్చాడు.

“సంజు సామ్సన్ ఆ జాబితాలో ఉండవచ్చు. అతను ఓపెనింగ్ బ్యాటింగ్‌కు దిగే సామర్థ్యం కలిగి ఉన్నాడు. అతను ఇప్పటికే దక్షిణాఫ్రికాలో సెంచరీ చేశాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కూడా ఉన్నారు. వీరిలో ఒకరు కూడా చేరగలరు. కానీ ఏదో ఒక విధంగా, ఈ టీ20 ప్రపంచ కప్‌లో సంజు సెంచరీ చేయగలడని నేను భావిస్తున్నాను” అని రైనా తెలిపాడు.

“నా అభిప్రాయం ప్రకారం ఫామ్ తాత్కాలికం. సంజుకి ఆ క్లాస్ ఉంది. టీ20 క్రికెట్‌లో చాలా పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్‌ను చూడండి. అతను దాదాపు ఒక సంవత్సరం నుంచి పరుగులు చేయలేదు. అయినప్పటికీ, కోచ్ అతనికి మద్దతు ఇచ్చాడు. సంజు విషయంలో కూడా అదే కథ ఉందని నేను భావిస్తున్నాను. అతనికి అవకాశం వస్తే, అతను ఖచ్చితంగా బాగా రాణిస్తాడు” అని చెప్పుకొచ్చాడు.

సంజు సామ్సన్ టీ20ఐ గణాంకాలు..

56 టీ20ఐలలో 48 ఇన్నింగ్స్‌లలో, శాంసన్ 24.36 సగటు, 147.86 స్ట్రైక్ రేట్‌తో 1072 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 111. దానికి తోడు 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేశాడు. కానీ, అతని ఇటీవలి ఫామ్ బాగా లేదు. అతని చివరి నాలుగు మ్యాచ్ లలో స్కోర్లు చూస్తే 11, 10, 6, 0, 24గా ఉన్నాయి. 2026 సంవత్సరం మంచి ఆరంభానికి రాలేదు. కానీ, ఇంకా సమయం ఉంది.

సంజు శాంసన్ టీ20 ప్రపంచ కప్‌లో సెంచరీ సాధించగలడా?

జనవరి 31న న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో శాంసన్ తన ఫామ్‌ను తిరిగి పొందాల్సి ఉంది. ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్ వస్తుంది. మరి శాంసన్ సెంచరీ సాధిస్తాడా, సురేష్ రైనా మాట నిజం అవుతుందా లేదా అనేది చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..