IPL 2021 : వీర బాదుడు బాదిన సంజు‌ శాంసన్..! అయినా వీరుడిగా జట్టును గెలిపించలేకపోయాడు..

|

Apr 13, 2021 | 3:26 PM

Sanju Samson : సంజు శాంసన్‌ సెంచరీ చేసినా రాజస్తాన్ రాయల్స్‌ విజయం సాధించలేకపోయింది. ఐపిఎల్ 2021లో అధిక స్కోరింగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్‌పై నాలుగు పరుగుల తేడాతో

IPL 2021 : వీర బాదుడు బాదిన సంజు‌ శాంసన్..!  అయినా వీరుడిగా జట్టును గెలిపించలేకపోయాడు..
Sanju Samson Century
Follow us on

Sanju Samson : సంజు శాంసన్‌ సెంచరీ చేసినా రాజస్తాన్ రాయల్స్‌ విజయం సాధించలేకపోయింది. ఐపిఎల్ 2021లో అధిక స్కోరింగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్‌పై నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం సంజు శాంసన్‌ మాట్లాడుతూ.. రాయల్స్ గెలవడానికి ఇష్టపడతానని కానీ ఇంతకన్నా తాను ఏమి చేయలేనని చెప్పాడు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్.. కెప్టెన్ కె.ఎల్.రాహుల్ మరో ఆటగాడు దీపక్ హుడాతో మూడో వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. దీంతో ఆరు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన సంజు శాంసన్‌ (119 పరుగులు, 63 బంతులు, 12 ఫోర్లు, ఏడు సిక్సర్లు) సెంచరీ చేసినప్పటికీ, ఏడు వికెట్లకు 217 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్‌ కెప్టెన్సీ అరంగేట్రంలోనే సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా సంజు శాంసన్‌ నిలిచాడు.

మ్యాచ్ తర్వాత సంజు శాంసన్‌ మాట్లాడుతూ.. తన అనుభూతిని వివరించడానికి మాటలు లేవు. జట్టును గెలిపించడానికి ఎప్పుడు ఇష్టపడతాను. తాను అంతకన్నా ఇంకా ఏం చేయగలనని చెప్పాడు. ఇదంతా ఆటలో భాగం. తాము వికెట్ మెరుగ్గా ఉందని భావించామని, లక్ష్యాన్ని చేధించగలమని అనుకున్నామని అన్నాడు. అయితే ఓటమి చెందినా జట్టు బాగా ఆడిందని కితాబిచ్చాడు. జట్టుకు విజయం ఇవ్వడానికి శామ్సన్‌కి చివరి బంతికి ఆరు పరుగులు అవసరం కానీ దీపక్ హూడా బౌండరీ దగ్గర క్యాచ్ పట్టాడు. తన ఇన్నింగ్స్ రెండో భాగం ఉత్తమమైనదన్నాడు. మొదటి భాగంలో తాను బంతిని సరిగ్గా టైమ్ చేయలేకపోయానని చెప్పాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా జరిగిన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శాంసన్‌ టాస్‌ వేసిన నాణెం అతడి వద్దే ఉంచుకున్నాడు. కానీ ఆ తర్వాత రిఫరీ నాణెం తీసుకున్నాడు. దీని గురించి ‘నాణెం చాలా బాగుంది అందుకే జేబులో పెట్టుకున్నానని చెప్పాడు. అయితే నాణెం ఇవ్వగలవా అని రిఫరీని అడిగాడు కానీ అందుకు ఆయన నిరాకరించాడు. అయితే థ్రిల్లర్‌ సినిమాకు ఏమాత్రం తీసిపోని ఈ మ్యాచ్‌కు, అంతేకాకుండా సంజ్‌ శాంసన్‌ బ్యాటింగ్‌ శైలిపై సోషల్ మీడియాలో మీమ్స్‌, జోక్స్‌ వేస్తున్నారు. మ్యాచ్‌లోని ఉత్తమ సందర్భాలను వివరిస్తున్నారు. #RRvsPBKS నుంచి వచ్చిన కొన్ని ఉత్తమ కామెంట్స్ చూడండి..

 

Also Read: Low-Cost House: తక్కువ ఖర్చుతో 15 రోజుల్లో మైక్రో ఇల్లు రూపకల్పన చేసిన అమ్మాయిపై కవిత ప్రశంసల వర్షం

Israel King Solomon: ఏకంగా 700మందిని పెళ్లిళ్లు చేసుకున్న ఆదేశపు రాజు.. వారిలో విదేశీ యువరాణిలు కూడా

Water on Mars: అంగారక గ్రహంపై నీరు.. కీలక డేటాను సెండ్ చేసిన నాసా పర్సీవరెన్స్ రోవర్..